మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికి దాదాపు 3 నెలలు ఏ మూవీ స్టార్ట్ చేయలేదు. బ్రూస్ లీ ఫ్లాప్ కారణంగా సేఫ్ ప్రాజెక్ట్ చేయాలని ఒక వైపు, తండ్రి మెగాస్టార్ చిరంజీవి కత్తి రీమేక్ పనులు మరోవైపు చూస్కోవడంతో ప్రాజెక్ట్ ప్రారంభించడం బాగానే డిలే అయింది. ఇక లుక్ విషయంలోనూ చేంజ్ చూపించాలని భావించడంతో, ఆ వైపు ప్రయత్నాలు చేశాడు చరణ్.
ఇప్పుడు అన్ని కసరత్తులు పూర్తయిపోవడంతో.. ఇక తనిఒరువన్ రీమేక్ ని మొదలుపెట్టేసేందుకు చెర్రీ సిద్ధమయ్యాడు. ఫిబ్రవరిలో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. ప్రస్తుతం మ్యూజిక్ సిట్టింగులు బిగిన్ అయ్యాయి. ఈ సినిమాతో కోలీవుడ్ సంగీత దర్శక ద్వయం హిప్ హాప్ తమీజా టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తున్నారు. తెలుగు మూవీ పనులను బెంగళూరులో మొదలుపెట్టినట్లు.. వీరు ట్వీట్ చేయడంతో తనిఒరువన్ కి సంబంధించిన పనులు మొదలయ్యాయనే కన్ఫర్ మేషన్ అందింది.
కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ మూవీని తెలుగులో అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు. ఒరిజినల్ లో విలన్ పాత్రను చేసిన అరవింద్ స్వామి ఇందులో కూడా అదే రోల్ ను చేయనుండగా.. శృతిహాసన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఇప్పటికే తెలుగు వెర్షన్ కి అవసరమైన మార్పులను పూర్తి చేసేశాడు. ఈ మూవీని రక్షక్ అనే వర్కింగ్ టైటిల్ అనుకుంటున్నారు మేకర్స్.