కరోనా విపత్కర పరిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా తనయుడు రామ్ చరణ్ - కోడలు ఉపాసన తమ వంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు అభిమానులకు, ప్రజలకు సందేశాలు ఇవ్వడమే కాకుండా.. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టి సేవా భావాన్ని చాటుకుంటున్నారు. ఎందరికో ఆర్థిక సాయం చేసి వారి జీవితాలను భరోసా కల్పించారు. ఇప్పటికే ఉన్న బ్లడ్ బ్యాంక్ - ఐ బ్యాంక్ లకు తోడుగా కొత్తగా ఆక్సిజన్ బ్యాంకులు అనే బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు. చిరంజీవి - చరణ్ లను ఆదర్శంగా తీసుకున్న మెగా అభిమానులు కూడా తమ బాధ్యతగా పలు ఛారిటీ కార్యక్రమాలు చేశారు. వైరస్ విజృంభిస్తున్న సమయంలో ప్రజలకు సేవలు చేసిన ఫ్రంట్ లైన్ వారియర్స్ ను సత్కరించారు. ఈ నేపథ్యంలో మెగా అభిమానులను రామ్ చరణ్ అభినందించారు.
కోవిడ్-19 పాండమిక్ సమయంలో బాధలో ఉన్నవారికి అండగా నిలవడానికి స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపట్టినందుకు ఫ్యాన్స్ కి అభినందనలు తెలుపుతూ చరణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ''అభిమానులు ఈ కోవిడ్-19 మహమ్మారి సమయంలో కష్టపడి చేస్తున్న ఈ సమాజ సేవ గురించి నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను. అత్యవసర పరిస్థితిలో ఉన్న సామాన్యుడికి సహాయం చేయటం నుండి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొనటం వరకు, మీరు ఎంతో అంకితభావంతో పని చేసారు. ఎన్నో వ్యయప్రయాసలు కూర్చి ఎందరికో సహాయం చేసిన మీ అందరికీ పేరు పేరున నా శుభాభినందనలు. మీ అందరి అంకితభావానికి నా ధన్యవాదాలు'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.