మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇది చరణ్ కెరీర్ లో 15వ చిత్రం అవడం.. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడం.. దిల్ రాజు బ్యానర్ లో మైలురాయి 50వ చిత్రం కావడం ప్రేక్షకుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షించింది.
ఇప్పటికే RC15 కు సంబంధించి కీలకమైన రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ కంప్లీట్ అయింది. తాజా షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే రాజమండ్రిలో మొదలైంది. రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో మూడు విభిన్నమైన గెటప్స్ లో కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. యంగ్ ఫాదర్ - సన్ గా చరణ్ కనిపించనున్నారని.. కాకపోతే రెండు పాత్రలు ఒకే ఫ్రేమ్ లో ఉందని అంటున్నారు.
ప్రస్తుతం రాజమండ్రిలో షెడ్యూల్ లో ఫ్లాష్ బ్యాక్ లో ఫాదర్ రోల్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతోందని టాక్. ఇందులో చెర్రీ పంచె కట్టులో వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్నారని అంటున్నారు. రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయిన చరణ్ పిక్స్ చూస్తే ఇది నిజమేమో అనే సందేహం కలుగుతుంది. ఏదేమైనా శంకర్ RC15 లో మెగా వారసుడిని ఇంతకుముందెన్నడు చూడని విధంగా.. సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారని తెలుస్తోంది.
నిజానికి శంకర్ మొదటి నుంచీ తన సినిమాల్లో హీరోలను డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తున్నారు. 'భారతీయుడు' లో పెద్ద కమల్ హాసన్ - 'అపరిచితుడు' మరియు 'ఐ' చిత్రాల్లో విక్రమ్ - 'రోబో' అండ్ '2.0' మూవీలలో రజినీకాంత్ లను శంకర్ కొత్తగా చూపించారు. ఇక 'జెంటిల్ మ్యాన్' 'ఒకే ఒక్కడు' చిత్రాల్లో అర్జున్ ను స్టైలిష్ గా చూపించారు. ఇప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ మేకోవర్ అభిమానులను మెప్పిస్తుందని చెబుతున్నారు.
RC15 అనేది ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిలర్. విలక్షణ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు అందించిన కథతో తెరకెక్కుతోంది. దీనికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో చరణ్ గెటప్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టిన శంకర్.. ఐఏయస్ ఆఫీసర్ - చీఫ్ మినిస్టర్ లతో పాటుగా సాధారణ యువకుడిగా హీరోని చూపించబోతున్నారట. చెర్రీ మేకోవర్ మరియు గెటప్స్ వెండి తెర మీద సినీ అభిమానులను సర్ప్రైజ్ చేస్తాయని అంటున్నారు.
ఇందులో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అంజలి - సునీల్ - శ్రీకాంత్ - జయరామ్ - నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్ జె సూర్య విలన్ గా నటిస్తారనే టాక్ వినిపిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తుండగా.. తిరు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. బుర్రా సాయి మాధవ్ డైలాగ్స్ రాస్తున్నారు. 2023 సంక్రాంతి కానుకగా తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.