రామ్ చరణ్ బాలీవుడ్ ఎంట్రీ నెగెటివ్ ఫలితాన్నే మిగిల్చింది. ఆరంభమే జంజీర్ రూపంలో పరాజయం పలకరించింది. అందుకే చరణ్ ఇంతకాలం బాలీవుడ్ లో రెండో సినిమా గురించి ఆలోచించనేలేదు. అయితే ఇంతకాలానికి నీరజ్ పాండే దర్శకత్వంలో ఓ కామియో చేసేందుకు అతడు సిద్ధమవుతున్నాడని ప్రచారమవుతోంది.
ఎ వెడ్నెస్ డే, స్పెషల్ చబ్బీస్ సినిమాలతో నీరజ్ పాండే ప్రేక్షకలోకానికి సుపరిచితం. అతడు ప్రస్తుతం ధోని అనే బయోపిక్ తెరకెక్కిస్తున్నాడు. భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. టైటిల్ పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటిస్తున్నాడు. ఇందులో చరణ్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్ మన్ సురేష్ రైనా గా నటిస్తాడని చెబుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఇదో హాట్ న్యూస్.
ఇప్పటికైతే టాలీవుడ్ లో ఈ విషయం గురించిన ప్రస్తావన లేనేలేదు. నీరజ్ చరణ్‌కి ఈ క్యారెక్టర్ గురించి చెప్పాడు. వెంటనే కామియోకి ఓకే చెప్పేశాడని ఉత్తరాది మీడియా కోడై కూస్తోంది. ఓవైపు చరణ్ బ్రూస్ లీ సినిమాతో బిజీ. అతడి నుంచి అధికారికంగా ఎలాంటి వార్తా రాలేదు. నిప్పు లేకుండా పొగ రాదంటారు. చరణ్ వైపు నుంచి చూద్దాం, చేద్దాం అనే మాట అయినా వచ్చి ఉండాలి. అందుకే ఈ వార్త హల్ చల్ చేస్తోందని అనుకోవచ్చు.