మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'వినయ విధేయ రామ' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పేరు చాలా సాఫ్ట్ గా.. కవితాత్మకంగా ఉన్నా సినిమా ఫస్ట్ లుక్.. టీజర్ మాత్రం మాస్ మసాలా రచ్చ రంబోలాగా ఉండడంతో కంటెంట్.. టైటిల్ మ్యాచ్ కాలేదని విమర్శలు వ్యక్తం అయ్యాయి. కానీ కార్తీక పౌర్ణమి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో వినయం.. విధేయత ఉట్టిపడింది!
రామ చరణుడంటే ఎవరు? రాముడి చరణాల దగ్గర ఉండే వాడు. అంటే హనుమంతుడు. ఫస్ట్ లుక్ లో.. టీజర్లలో హనుమంతుడిలా రచ్చ చేసిన చరణ్ బేసిక్ గా అలా కాదని.. నిజంగా హనుమంతుడి టైప్ లో వినయంగా విధేయంగా ఉండే రకమేనని ఈ కొత్త పోస్టర్ లో తెలిసేలా ఉంది. సంప్రదాయం పూర్తిగా కనిపిస్తున్న దుస్తులలో.. నుదుటిన బొట్టు పెట్టుకుని దణ్ణం పెడుతున్న చరణ్ ని చూస్తే ఎవరైనా వినయంగానే ఉంటాడని అనుకునే ప్రమాదం ఉంది!
ఈ పోస్టర్ లో ఇంకో హైలైట్ ఏంటంటే.. బ్యాక్ గ్రౌండ్ లో మసగ్గా ఆర్యన్ రాజేష్ కూడా నమస్కారం పెడుతూ ఉన్నాడు. పోస్టర్ ని కొంచెం పరిశీలిస్తే అది మనకు తెలుస్తుంది. ఏదేమైనా కార్తీక పౌర్ణమి చరణ్ గెటప్ మాత్రం అదిరిపోయిందంతే.