మంచులో బెస్ట్ ఫ్రెండ్స్ తో చెర్రీ ఆటలు

Update: 2017-12-30 05:11 GMT
రామ్ చరణ్.. ఉపాసన భార్యాభర్తలు అయినా.. ఉపాసన చెప్పే మాటలు వింటుంటే.. ఆమె చరణ్ గురించి డీటైలింగ్ ఇచ్చే విధానం పరిశీలిస్తే.. స్నేహితుని గురించి చెప్పినట్లే ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఇద్దరూ భలే ఎంజాయ్ చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వివరాలను కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు క్రిస్మస్ సీజన్ వెళ్లిపోయి న్యూఇయర్ వచ్చేస్తోంది. చలికాలం కదా. ఇలాంటి సమయంలో మంచుతో ఆడుకుంటూ ఉంటే భలే మజాగా ఉంటుంది. ఇక స్నేహితులతో ఎంజాయ్ చేయడం అంటే మరీ ముచ్చటగా ఉంటుంది. చెర్రీ ఫ్యామిలీకి టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బాగా సన్నిహితురాలు. అనేక ఈవెంట్లలో.. కార్యక్రమాల్లో రామ్ చరణ్ తో పాటు కానీ.. ఉపాసనతో పాటు కానీ కనిపిస్తుంటుంది సానియా. ఇప్పుడు మంచు ఆటల్లో కూడా ఇద్దరి మధ్యా ఎంచక్కా చేరిపోయింది.

నేలపై నుంచి మంచు తీసి చెర్రీ అందిస్తుంటే.. ఉపాసన - సానియా మీర్జా ఇద్దరూ ఆ మంచును గాల్లోకి ఎగరేస్తూ భలే ఆడుకుంటున్నారు. రివర్స్ యాప్ ఉపయోగించి.. మళ్లీ ఆ మంచు తిరిగి చేతిలోకి వస్తున్నట్లుగా ఎడిటింగ్ చేసిన వీడియోను.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఉపాసన. బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి.. మిస్టర్ సీతో క్యాండిడ్ మూమెంట్స్.. ఇయర్ ఎండ్ లో ఎంజాయ్ చేస్తున్నామని ఉపాసన చెప్పిన తీరు.. పోస్ట్ చేసిన వీడియో.. మెగా ఫ్యాన్స్ కు తెగ నచ్చేస్తోంది.


Tags:    

Similar News