బాహుబలి రికార్డుల్ని బ్రేక్ చేస్తూ జపాన్ లో ఆర్.ఆర్.ఆర్ సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం చరణ్ - ఎన్టీఆర్- రాజమౌళి బృందం జపాన్ లో పర్యటించి సినిమాకి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక హీరోలు ఇద్దరూ తమ భార్యామణులతో జపాన్ యాత్రకు వెళ్లడం ఇంట్రెస్టింగ్.
తారక్- చరణ్ జపాన్ మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. తాజాగా చరణ్ ఉపాసనతో పాటు ఉన్న ఓ ఫోటోని షేర్ చేసారు. అలాగే అన్యోన్య దంపతులు అభిమానులకు జపాన్ నుంచే దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీనికి చెర్రీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఇంతకుముందే RRR స్టార్ రామ్ చరణ్ జపాన్ అభిమానుల ఆడిటోరియంలో ప్రసంగిస్తూ అత్యంత భావోద్వేగ ప్రసంగాన్ని అందించారు. జపనీస్ అభిమానుల నుండి ప్రేమ మద్దతు ఎంత మనోహరం? నా మాతృభూమిలో ఉన్నట్లు అనిపించింది! అంటూ చరణ్ ఉద్వేగంగా మాట్లాడారు.
``మేం భారతదేశంలో ఉన్నట్లు నాకు అనిపించింది`` అని చరణ్ అనడంతో జపానీ అభిమానులు హర్షం వ్యక్తం చేసారు.
``మీరు చాలా ప్రేమగా ఉన్నారు. మనం భారతదేశంలో ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. ప్రపంచంలోని ప్రతి నటుడు ప్రేమ ను అభిమానాన్ని అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడ చాలా భావోద్వేగాలను చూడగలను. ఇది నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా హృదయాన్ని కదిలించే ప్రేమ.. ఈ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. ఉద్వేగంలో మాటలు రావడం లేదు`` అని చరణ్ ఎమోషనల్ అయ్యారు. నేను జపాన్ నుండి ఈ ప్రేమను తీసుకుంటున్నాను. వినయం- నిజాయితీ తోటివారికి మీరంతా ఇచ్చే గౌరవం మరిపించాయి`` అని చరణ్ అన్నారు.
తన పాఠశాల రోజుల్లోకి వెళ్లిన రామ్ చరణ్ తన ఉపాధ్యాయుడు జపాన్ గురించి చెప్పిన పాఠాన్ని గుర్తు చేసుకున్నారు. జపాన్ దేశం మరే ఇతర దేశంలో లేని విధంగా అతి పెద్ద విపత్తును ఎదుర్కొని దాని నుండి కంబ్యాక్ అయ్యి ఎదిగిన తీరు గురించి చెప్పేవారని అన్నారు.
నేను రాజమౌళి ఇతర దర్శకులతో కూడా ఈ దేశానికి మళ్లీ మళ్లీ రావాలనుకుంటున్నాను. మీరు మమ్మల్ని మళ్లీ స్వాగతిస్తారని ఆశిస్తున్నాను అని చెబుతూనే “ఐ లవ్ యూ జపాన్!” అంటూ హృద్యంగా తన ప్రసంగాన్ని ముగించారు మెగా పవర్ స్టార్.
రజనీకాంత్- ప్రభాస్ జపాన్ లో గొప్ప ప్రేమను అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు రామ్ చరణ్.. తారక్ కి జపాన్ ప్రేక్షకుల నుండి విపరీతమైన ప్రేమ దక్కుతోంది. అతని ప్రసంగ సమయంలో కూడా ప్రజలు ప్రేమపూర్వక సంజ్ఞగా RRR పోస్టర్ ప్లకార్డ్ ను పట్టుకుని ఉత్సాహాన్ని ప్రదర్శించడం ఆకట్టుకుంది. బ్లాక్ బస్టర్ చిత్రం RRR శుక్రవారం జపాన్ లో గ్రాండ్ గా విడుదలైంది. భారీ వసూళ్లను సాధిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.