చరణ్‌ రీ ఎంట్రీ... ఫ్యాన్స్‌ కు డబుల్‌ ధమాకా

Update: 2020-03-26 08:00 GMT
నిన్న ఉగాది సందర్బంగా మెగాస్టార్‌ చిరంజీవి సోషల్‌ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. మెగాస్టార్‌ ఎంట్రీతో సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్స్‌ అయిన ట్విట్టర్‌ ఇంకా ఇన్‌ స్టాగ్రామ్‌ లు మారు మ్రోగి పోయాయి. ట్విట్టర్‌ లో మెగాస్టార్‌ చిరంజీవిని 24 గంటల్లోనే ఏకంగా లక్షన్నర మంది ఫాలో అవుతున్నారు. ఈ సంఖ్య ఎంత దూరం పోతుందో చూడాలి. ఈ సమయంలోనే మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కూడా ట్విట్టర్‌ లో రీ ఎంట్రీ ఇచ్చాడు.

రీ ఎంట్రీ అని ఎందుకు అంటున్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం రామ్‌ చరణ్‌ ట్విట్టర్‌ లో ఉండేవాడు. కాని ఆ సమయంలో కొన్ని ట్వీట్స్‌ ఆయన్ను బాధపెట్టడం వల్ల ట్విట్టర్‌ ను వదిలేసినట్లుగా ప్రచారం జరిగింది. ట్విట్టర్‌ ను వదిలేసిన కారణం ఏంటీ అనేది చరణ్‌ ప్రకటించలేదు. దాంతో ఆ విషయం అక్కడితో ముగిసి పోయింది. తాను ఏదైనా అనుకుంటే ఆ విషయాన్ని ఫేస్‌ బుక్‌ ద్వారా ఇన్నాళ్లు చెబుతూ వస్తున్న చరణ్‌ కొన్నాళ్ల క్రితం ఇన్‌ స్టా గ్రామ్‌ ను ఓపెన్‌ చేశాడు.

తండ్రి ఎంట్రీ ఇచ్చిన తర్వాత రోజే చరణ్‌ కూడా ట్విట్టర్‌ లో రీ ఎంట్రీ ఇచ్చాడు. మొదటి ట్వీట్‌ గా బాబాయి పవన్‌ కళ్యాణ్‌ ను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని కరోనాపై యుద్దంకు తనవంతు సాయంగా 70 లక్షల సాయం ప్రకటిస్తున్నట్లుగా చరణ్‌ ట్వీట్‌ చేశాడు. కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సాయంను అందించబోతున్నట్లుగా ట్వీట్‌ లో చరణ్‌ పేర్కొన్నాడు.

చరణ్‌ రీ ఎంట్రీ విషయాన్ని మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా తెలియజేశాడు. చరణ్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ఐడీని పోస్ట్‌ చేసి వెల్‌ కం టు చరణ్‌ అటూ చిరంజీవి ట్వీట్‌ చేశాడు. నిమిషాల వ్యవధిలోనే చరణ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య వేలల్లోకి చేరింది. ఒక్క రోజు గ్యాప్‌ లో తండ్రి కొడుకులు ట్విట్టర్‌ లో జాయిన్‌ అవ్వడం అరుదైన విషయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్‌ కు ముఖ్యంగా ట్విట్టర్‌ లో ఉండే మెగా ఫ్యాన్స్‌ కు డబుల్‌ ధమాకా అనుకోవచ్చు.
Tags:    

Similar News