చరణ్‌-ఉప్సీ.. పబ్లిక్ గా ఎంత ప్రేమో

Update: 2017-06-30 05:09 GMT
రామ్ చరణ్- ఉపాసనల జంట ఎంతో మందిని ఆకర్షిస్తూ ఉంటుంది. భర్త సినిమా రంగంలో మెగా పవర్ స్టార్ అయితే.. ఉపాసన ఆరోగ్య రంగంలో పవర్ ఫుల్ గా దూసుకుపోతోంది. వీరిద్దరు ఒకరిపై ఒకరు తమ ప్రేమను చాటేందుకు ఏ మాత్రం సంశయించరు. అనుబంధాన్ని చాటి చెబుతూ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుంటారు. అది కూడాను ఓపెన్ గా సోషల్ నెట్వర్కులో తమ ప్రేమంతా చూపించేస్తారు.

'మిస్టర్ సీ' అంటూ.. తన భర్త చెర్రీ గురించి ఉపాసన చేసే ట్వీట్స్ కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అలాగే తన భార్య గురించి చెప్పేందుకో.. ఆమెను ప్రశంసించేందుకో.. చెర్రీ చేసే పోస్టులు కూడా ఆకట్టుకుంటాయి. రీసెంట్ గా ఉపాసనకు ఓ అవార్డు వచ్చింది. హెల్త్ కేర్ రంగంలో ఆమె చేస్తున్న సేవలకు గాను.. ఫెమినా ఉమన్స్ అవార్డ్స్ 2017లో ఈమెకు ప్రత్యేకంగా అవార్డ్ ఇచ్చారు. ఉపాసన ఈ విషయాన్ని అందరితోను పంచుకోగా.. ఉపాసన-అవార్డు ఫోటోలను కలిపి పోస్ట్ చేసిన రామ్ చరణ్.. 'నిన్ను చూస్తే గర్వంగా ఉంది ఉప్సీ' అంటూ తన అభినందనలు చెప్పాడు.

దీనికి మెగా పవర్ స్టార్ వైఫ్ నుంచి వచ్చిన రియాక్షన్ ఇంకా అద్భుతంగా ఉంది. 'థ్యాంక్యూ మై లవ్. నువ్వు.. నీ సపోర్ట్ లేకుండా నేను ఇదంతా సాధించగలిగే దాన్నికాదు' అంటూ ఉపాసన రిప్లై ఇచ్చింది. భార్యా భర్తలు ఇద్దరూ ప్రేమాభిమానాలు కలిగి ఉండడమే కాదు.. దాన్ని ఇంత పబ్లిక్ గా ప్రదర్శించడం కూడా ప్రత్యేకించి చెప్పుకోవాలి. మిస్టర్ సీ- ఉప్సీ అంటూ వీరు కురిపించే ప్రేమ మెగా ఫ్యాన్స్ ను మాతరమే కాదు.. అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. చాలామందికి ఇవన్నీ ఒక రిలేషన్షిప్ గోల్ తరహాలో కూడా ఉపయోగపడుతుంది. గుడ్ లక్ సి అండ్ ఉప్సీ!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News