వరుస పరాజయాలతో విసిగిపోయిన రామ్ కి `ఇస్మార్ట్ శంకర్` విజయం పెద్ద రిలీఫ్ నిచ్చిన సంగతి తెలిసిందే. పూరి- ఛార్మి జోడీకి కొన్ని పరాజయాల తర్వాత ఈ విజయం ఎంతో ఊరటనిచ్చింది. ఇస్మార్ట్ సక్సెస్ తో ఇస్మార్ట్ గా తదుపరి చిత్రాల కోసం ఎవరికి వారు ప్రణాళికల్లో ఉన్నారు. అన్నట్టు ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని నిర్మించిన పూరి-ఛార్మి జోడీకి ఏ మేరకు లాభాలొచ్చాయి? అంటే ప్రచారార్భాటం చూశాక.. 30కోట్ల వసూళ్లు అంటే దాదాపు 10కోట్ల మేర లాభం ఖాతాలోకి వచ్చిందనే భావించారు. అయితే ఈ సినిమాకి బ్లాక్ బస్టర్ హంగామా తప్ప నిర్మాతలకు లాభాలు ఆశించిన స్థాయిలో రాలేదని తెలుస్తోంది. నిర్మాతలు పూరి- ఛార్మికి మిగిలింది తక్కువే. కేవలం 5 కోట్లు మిగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
అయితే `ఇస్మార్ట్ శంకర్` వల్ల పూరికి అరడజను సినిమాల వరకూ ఏ డోఖా లేదు.. అంత గొప్ప పేరొచ్చింది. కేవలం ఎనర్జిటిక్ రామ్ మాస్ పెర్ఫామెన్స్ ని హైలైట్ చేస్తూ సినిమాని తీసిన విధానానికి ప్రశంసలు దక్కాయి. పూరి మార్క్ ఫార్ములాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సినిమా ఆద్యంతం రామ్ నటన.. ఇద్దరు గ్లామర్ డాళ్స్ తో నడిపించేశాడంటే అది కేవలం పూరీకి మాత్రమే సాధ్యమైన విద్య అంటూ క్రిటిక్స్ విశ్లేషించారు. ఇక ఇదే ఊపులో ఎనర్జిటిక్ రామ్ నటించిన గత ఫ్లాప్ సినిమాలను హిందీలోకి అనువదించి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తుంటే వీటికి ఉత్తరాది జనం నుంచి బాగానే స్పందన వస్తోంది.
రామ్ నటించిన నేను శైలజ- ఉన్నది ఒక్కటే జిందగీ- హలో గురూ ప్రేమకోసమే చిత్రాల్ని హిందీలోకి అనువదించి యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. నేను శైలజను `ది సూపర్ కిలాడీ 3` పేరుతో రిలీజ్ చేస్తే 105 మిలియన్ వ్యూస్ దక్కాయి. రామ్ యూట్యూబ్ చానెల్ కి 7లక్షలుపైగా సబ్ స్క్రైబర్స్ ఉండడం ఈ వ్యూస్ కి కలిసొస్తోంది. `ఉన్నది ఒక్కటే జిందగీ` చిత్రాన్ని `నం.1 దిల్ వాలా` పేరుతో హిందీలోకి అనువదించి రిలీజ్ చేస్తే 118 మిలియన్ వ్యూస్ 837కె లైక్స్ దక్కాయి. ఈ హిందీ డబ్బింగును ఒకే రోజులో 30 మిలియన్ల మంది వీక్షించడం ఆసక్తికరం. `హలో గురు ప్రేమకోసమే` చిత్రాన్ని `దమ్ దార్ ఖిలాడీ` పేరుతో అనువదించి యూట్యూబ్ లో రిలీజ్ చేస్తే చాలా తక్కువ సమయంలో100 మిలియన్ వ్యూస్ (10కోట్ల వ్యూస్) దక్కాయి. దీనిని బట్టి యూట్యూబ్ లో ఫ్రీగా సినిమాలు చూపిస్తామంటే ఆదరణ ఏ స్థాయిలో ఉంటుందో కూడా అర్థం చేసుకోవచ్చు.