వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ హీరోలను ఎద్దేవా చేసేలా మాట్లాడారు. ఒకప్పుడు క్రియేటివిటీతో ఇండస్ట్రీని శాసించిన వర్మ ఇప్పుడు బూతు రాజకీయాలతో భ్రష్టు పట్టిపోయాడు.వివాదాలతో కాలం గడిపేస్తున్నాడు. తాజాగా తెలంగాణ ఫైర్ బ్రాండ్ జంట కొండా మురళీ-సరేఖలపై బయోపిక్ ‘కొండా’ను తెరకెక్కిస్తున్నారు.
తాజాగా వర్మ వరంగల్ లోనే ఉండి ‘కొండా సినిమాను షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టిన వర్మ.. ఒక్క కొండాలో మాత్రమే కాదు అసలు తన కథలో ఎక్కడా హీరోలు ఉండరని.. కేవలం పాత్రలే ఉంటాయని.. అది కూడా కొండా సినిమాలో తాను నమ్మిన నిజమే హీరో అన్నారు.
ఇక ‘కొండా’ సినిమా విషయంలో తనకు వరంగల్ కు చెందిన ప్రముఖ పొలిటీషిషయన్ నుంచి బెదిరింపులు వచ్చిన మాట వాస్తవమేనని వర్మ బాంబు పేల్చారు. ‘నల్లబల్లి సుధాకర్’ అనే పేరుతో నాకు వార్నింగ్ ఇచ్చినట్టు వర్మ చెప్పుకొచ్చాడు. నల్లబల్లి సుధాకర్ అనే పాత్ర కూడా తన సినిమాలో ఉందన్న వర్మ అలసు ఈ బెదిరింపుల తర్వాతే ఈ పాత్ర పెట్టాలని బలంగా ఫీల్ అవుతున్నట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలే తన కథని చెప్పారు.
రక్తచరిత్ర నుంచి వంగవీటి వరకూ ప్రతి సినిమా కథ ఇలా వ్యక్తులు, సమాజంలో వారి ప్రభావం ఆధారంగానే తన సినిమాలుంటాయని.. తన కథలో అసలు హీరోలు ఉండరని వర్మ చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాల వల్ల ఇబ్బంది కలుగుతుందనే వాళ్ల గురించి అసలు తాను పట్టించుకోనన్న వర్మ అసలు ఈ లోకంలో ఏది చెప్పినా ఎలాంటి సినిమా చేసినా ఎవరికో ఒకరికి ఇబ్బంది కలుగుతుందని స్పష్టం చేశారు.
Full View