రాంగోపాల్ వర్మ మారిపోయాడా?

Update: 2017-04-14 09:42 GMT
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ఎవరైనా మాట్లాడినా, మీడియాలో ఆయన గురించి రాసినా, టీవీల్లో చెప్పినా ఆయన పేరు ముందు ఒక విశేషణం ఉంటుంది. అది ‘‘వివాదాస్పద’’.. వివాదాస్పదం అన్నది ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. అలాంటి రాము ఇప్పుడు మంచి బాలుడిగా మారిపోయాడట. తన నోటి దురుసుతో ఇంతకుముందు ఎవరెవరిని బాధించాడో వారందరికీ క్షమాపణలు చెబుతున్నాడట. రెండు రోజులుగా ఆయన అదే పనిలో ఉన్నట్లు చెబుతున్నారు.

అయితే... గతంలో అర్థం పర్థం లేని ట్వీట్లతో వార్తల్లో నిలిచేందుకు ఎడాపెడా ట్వీట్లు చేసిన వర్మలో ఇంత మార్పు ఎందుకు వచ్చింది?  అసలు దేవుళ్లు - సినీ నటులు - సామాజిక అంశాలు - అభిమానులు - దేశ విదేశాల నేతల ఇలా ఒకటేమిటి... ప్రతి అంశంలోనూ ట్వీట్లు చేయడం.. తద్వారా కేసులు నెత్తిమీద వేసుకోవడం రాంగోపాల్ వర్మకు సర్వసాధారణరమే. కానీ, ఇప్పుడాయన చాలామందికి సారీలు చెప్పుకొంటూ పోతున్నాడు.
    
వర్మ సారీలకు కారణం ఓ బాలీవుడ్ యువ నటుడని చెబుతున్నారు. వర్మ ఇటీవల తాను తీసిన సినిమాలో నటించిన జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ను బాలీవుడ్ వర్థమాన నటుడు విద్యుత్ జమ్వాల్ తో పోల్చుతూ పలు ట్వీట్లు చేశాడు. 'కమాండో' సినిమాతో మంచి బాడీ కలిగిన హీరోగా పేరుతెచ్చుకునే ప్రయత్నం చేస్తున్న విద్యుత్ జమ్వాల్ ను వర్మ కించపరిచాడు. దీనిపై నొచ్చుకున్న విద్యుత్ జమ్వాల్...  రాంగోపాల్ వర్మకు ఫోన్ చేసి, తానెవరో, తానేంటో మీకు తెలియదని, అలాంటప్పుడు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించాడు. అంతే కాకుండా టైగర్ ష్రాఫ్ ను పొగడాలనుకున్నప్పుడు నేరుగా అతనినే పొగడాలని, అలా కాకుండా అతనిని పొగిడేందుకు తనను కించపరచాల్సిన అవసరం ఏంటని నిలదీశాడు. ఈ విధానం సరైనది కాదని సూచించాడు. దీంతో వర్మకు చేసిన తప్పు అర్ధమైంది. దీంతో అతనికి క్షమాపణలు చెప్పాడు. ఈ సంభాషణను విద్యుత్ జమ్వాల్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసి, వర్మ క్షమాపణ చెప్పాడంటూ ట్వీట్ చేశాడు.
    
ఆ తర్వాత నుంచి వర్మ ఇలా క్షమాపణలు చెప్పడం ప్రారంభించాడట. ఇంతవరకు వర్మ ఎవరిపైనా విమర్శలు చేస్తే వారు తిరగబడడం.. వర్మ మరింత రెచ్చిపోవడం జరుగుతుండేది. కానీ, ఈ నటుడు సాఫ్టుగా వర్మతో మాట్లాడడంతో వర్మలో మార్పు వచ్చిందట. అయితే, ఇది ఎంత కాలం ఉంటుంది అనేదే డౌట్.

Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News