యాపిల్‌ అమ్మాయిలు కావాలా నాయనా?

Update: 2015-03-16 13:32 GMT
యాపిల్‌ ఐప్యాడ్‌ వచ్చింది.. యాపిల్‌ ఫోన్‌ వచ్చింది.. యాపిల్‌ వాచ్‌ కూడా వచ్చింది.. ఇప్పుడు యాపిల్‌ సంస్థ ఇక అమ్మాయిలను తయారుచేసి.. ఐ-ఉమెన్‌ అని పెడితే బాగుండు..!! ఇటువంటి ఐడియా మీక్కూడా వచ్చిందా? మీకు రాకపోతేనేం.. మన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు మాత్రం వచ్చేసింది.

మొన్నటివరకు కేవలం మతాల మీద, శ్రీరాముడు మీద, పక్కనోడి సినిమాల మీద, చిరంజీవి 150వ మూవీ పైనా కామెంట్లు విసిరిన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ముందునుండీ అందమైన అందాలపై, సెక్స్‌పైన చాలా ట్వీట్లు విసిరేవాడు. కాదేదీ ట్వీట్‌కు అనర్హం అన్నట్లు మనోడు రెచ్చిపోయే సీన్లు చాలానే చూశాం. అయితే ఈ మధ్యన శ్రీదేవి అంటే అందం, అందం     అంటే శ్రీదేవి అనే ఉపన్యాసం మానేసి.. ఇక యాపిల్‌ ఉమెన్‌ కావాలి అంటున్నాడు. గురూజీ ఇంతకీ ఈ కామెంట్‌ ఎందుకు చేశారంటే.. మొన్ననే యాపిల్‌ సంస్థ ఐ-వ్యాచ్‌ను రిలీజ్‌ చేసింది కాబట్టి. టెక్నాలజీ మీద ఈయనకు ఎప్పటికప్పుడు ఫుల్‌ గ్రిప్‌ ఉంటుంది కాబట్టే ఇటువంటి కామెంట్లు చేస్తుంటాడులేండి. కాని ఐ-ఉమెన్‌ తయారుచేయడం కుదరదు నాయనా.. ఇదేమీ స్టివెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా కాదుగా!!
Tags:    

Similar News