అరవింద్ కేజ్రీవాల్ గొప్ప నాయకుడే. భారత రాజకీయాల్లో ఆయనో సంచలనం. ఆమ్ ఆద్మీ పార్టీతో ఢిల్లీ రాజకీయాల్లో పెను విప్లవానికి తెర తీశాడు. మంచి పాలకుడిగానూ పేరు తెచ్చుకున్నాడు. కానీ ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించే విషయంలో ఆయన ఎంచుకునే వైఖరే ఆశ్చర్యం కలిగిస్తుంటుంది. ఈ క్రమంలో ఆయన దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మాట్లాడ్డానికి కూడా వెనుకాడడు. తాజాగా పాకిస్థాన్ తో సరిహద్దుల్లో సాగుతున్న పోరాటం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికే తెర తీశాయి. పాకిస్థాన్ మీద మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఆయన గొంతు కలుపుతూ అభ్యంతరక వ్యాఖ్యలు చేశారాయన. సైన్యం క్రెడిబిలిటీనే దెబ్బ తీసేలా ఆయన వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో మన రామ్ గోపాల్ వర్మ.. కేజ్రీవాల్ కు గట్టి పంచ్ ఇచ్చారు. మన సైన్యం ప్రత్యర్థులపై బయట సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే సరిపోదని.. కేజ్రేవాల్ లాంటి వాళ్లకు వ్యతిరేకంగా అంతర్గతంగా కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సిందే అని వర్మ అభిప్రాయపడ్డాడు. కేజ్రీవాల్ ను జాతి వ్యతిరేక శక్తిగానూ అభివర్ణించాడు వర్మ. నెత్తి మీద మఫ్లర్ తో కనిపించే కేజ్రీవాల్ కోతి లాగా అనిపించే వాడని.. ఐతే తాజాగా సైన్యం గురించి.. సర్జికల్ స్ట్రైక్స్ గురించి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలు చూశాక.. ఆయన నిజంగానే కోతి అనే విషయం కన్ఫమ్ అయిందని వర్మ తీర్మానించాడు. దేశం.. దేశభక్తి లాంటి విషయాల గురించి తేలిగ్గా మాట్లాడే వర్మే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడంటే ఇక సామాన్యులకు కేజ్రీవాల్ మాటలు ఎంత మంట పుట్టించి ఉంటాయో అంచనా వేయొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/