ఆర్జీవీ రీలోడెడ్! అవును ఇది పక్కా. ఆయన పనైపోయింది!! అనుకుంటున్న టైమ్ లో మళ్లీ ఆర్జీవీ రీలోడ్ అవుతున్నాడు. తుక్కులో పారేసిన రోబోలా.. బ్యాటరీని రీఛార్జ్ చేసుకుని మరీ వస్తున్నాడు. కార్బన్ డై ఆక్సైడ్ - మోనాక్సైడ్ లోంచి పుట్టిన విద్యుత్తుతో బ్యాటరీ తిరిగి రీఛార్జ్ అయ్యి.. ఆయనంతట ఆయనే రీలోడ్ అయిపోతున్నాడు. ఈ పరిణామం మునుముందు ఎలా మారనుందో? అంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అసలు ఆర్జీవీ అంటే ఎవరు? ఎంతో గొప్ప టెక్నీషియన్. సాంకేతికతతో ఆటాడుకునే సత్తా ఉన్న నిపుణుడు. అందులో డౌటే లేదు. కానీ ఎందుకనో అతడి ప్రతిభ పూర్తిగా మసకబారింది. పాతాళానికి దిగిపోయింది. అదంతా స్వయంకృతం అని కొందరంటే - లేదు ఆయన పనైపోయింది అనేవాళ్లే ఎక్కువమంది. కానీ ఆయనలో పనైపోలేదని తాజా పరిణామం చెబుతోంది. ఆయన ఫ్యాక్టరీ దుమ్ము దులుపుతున్నాడు. తిరిగి రీలోడ్ చేస్తున్నాడు. బుల్లెట్లు కూరుతున్నాడు. గత రెండున్నర దశాబ్ధాలుగా రామ్ గోపాల్ వర్మ ఫ్యాక్టరీ అల్ల కల్లోలం అయిన మాట వాస్తవం. ముంబైలో దుకాణం సర్దేసి హైదరాబాద్ గల్లీల్లో ఆయన స్లీపర్ సెల్ లా తిరిగేస్తున్నాడంటే దానివెనక ఏదో ఉంది. ఇంకేదో జరుగుతోంది.
అది ఇన్నాళ్టికి బయటపడుతోంది. ఐస్ క్రీమ్ - పేస్ట్రీ క్రీమ్ అంటూ తీసిన వన్నీ ఆయన టైమ్ పాస్ కోసం చేసినవి. బూతు వెబ్ సిరీస్ `గాడ్ సెక్స్ అండ్ ట్రూత్` ధనార్జన కోసం చేసిన ప్రయత్నం. ఆర్జీవీని సరిగా విశ్లేషిస్తే ఆయనలో చాలా కోణాలు బయటికొస్తాయి. నిలకడ లేని ఆలోచనలతో వర్మ ఫ్యాక్టరీ మూగవోయింది. సరైన హిట్టు లేక ఆర్జీవీ దర్శకుడిగా విఫలం అవ్వడంతో వచ్చిన ముప్పు ఇది. అటు బాలీవుడ్ - ఇటు టాలీవుడ్ రెండు చోట్లా ఇదే సీన్. అందుకే ఇప్పుడు ప్లాన్ మార్చాడు. రూటు మార్చి తాను కేవలం నిర్మాతగా - లేదా ప్రమోషన్ కార్యక్రమాలు చూస్తూ.. తన శిష్య బృందాన్ని బరిలో దించుతున్నాడు. ఆయన పనైపోయింది అన్నవాళ్లకు వేరే విధంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడట. అజయ్ (ఆర్.ఎక్స్ 100) - సిద్ధార్థ్ (భైరవ గీత)లతో పాటు ఇంకా కొందరిని తెర పైకి తెస్తున్నాడు. సిద్ధార్థ్ తెరకెక్కించిన `భైరవగీత` డిసెంబరు 7న రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆర్.ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా లాంచింగ్ ఉంటుందిట. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు స్క్రిప్టు పనులు సాగుతున్నాయి. ఈ సినిమాని ఆర్జీవీ- భూపతి సంయుక్తంగా నిర్మిస్తారు. ఇదొక్కటే కాదు.. ఆర్జీవీలా ఆలోచించేవాళ్ల సమ్మేళనం మునుముందు మరీ వికృతంగా మారనుందిట. అంటే ఫ్యాక్టరీ రీలోడ్ అయినట్టే. ఇక అందులోంచి తుపాకుల్ని - ఫిరంగుల్ని బరిలో దించుతారన్నమాట! ఆర్జీవీ అనగానే పెట్టుబడులు పెట్టేందుకు చాలామంది ముందుకొస్తారు. అలా వచ్చేవాళ్లంతా ఈ తుపాకులకు ఆహారం అన్నమాట!!?