విలక్షణ దర్శకుడు.. వివాదాలతో సహవాసం చేసే వర్మ తరచూ వార్తల్లోనే నిలుస్తుంటారు. ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పేసి.. ఇన్ స్టాగ్రాం.. ఫేస్ బుల్ లలో తన పోస్టులను పెడుతున్న ఆయన.. ఈ మధ్యన తన తొలి షార్ట్ ఫిలిం "మేరీ బేటీ సన్నీలియోన్ బన్నా చాహతి హై" ( నా కూతురు సన్నీలియోన్ లా కావాలనుకుంటోంది) ఇప్పుడు సంచలనంగా మారింది. ఓపక్క దీన్ని చూస్తున్న వాళ్లు చూస్తూనే ఉన్నారు. తిట్టే వాళ్లు తిడుతూనే ఉన్నారు. మొత్తంగా.. తనతొలి షార్ట్ ఫిలింపై భారీ చర్చ రేగేలా చేయటంలో మాత్రం వర్మ సక్సెస్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. వర్మను తిట్టటమే కానీ.. పొగిడేవారు.. అది కూడా పాయింట్ టు పాయింట్ గా పొగిడే వారు తక్కువగా కనిపిస్తుంటారు. తాజా సన్నీ చిత్రం మీద తిట్టే వాళ్లే కానీ పొగిడేవాళ్లు చాలా తక్కువ. అలాంటిది.. ఒక మహిళ తన తాజా పోస్ట్ లో ఈ చిత్రాన్ని విపరీతంగా పొగిడేయటమేకాదు.. వర్మ ఒక అద్భుతమైన వ్యక్తిగా అభివర్ణించిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.
హరిణి పేరుతో ఉన్న అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ పోస్ట్ కు ఎప్పుడూ రియాక్ట్ కానీ వర్మ సైతం రియాక్ట్ కావటమే కాదు.. తనను అర్థం చేసుకున్న హరిణి పోస్ట్ కు తానెంతో ప్రభావితం అయినట్లుగా రిప్లై పెట్టేశాడు. వర్మను ఇంతగా ప్రభావితం చేసిన ఆ పోస్ట్ లో ఉన్న కంటెంట్ ఏమిటో చూస్తే..
"ముందుగా దీన్నో సినిమాగా అర్థం చేసుకోవాలి. ఈ సినిమాను చూసిన వారు.. మీ కూతురు పోర్న్ స్టార్ అవుతానంటే సమర్థిస్తారా? లేదా? లాంటి ప్రశ్నలు అడగటంలో అర్థం లేదు. బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో ఒక మహిళ వ్యభిచారాన్ని ఎంచుకున్నట్లు.. వివాహేతర సంబంధాలు పెట్టుకున్నట్లు సినిమా తీశాయి. వాటిని తీసిన దర్శకుల్ని కానీ.. నటుల్ని కానీ మీరు ఇలా ఎందుకు తీస్తున్నారు? అని అడిగారా? లేదే. జీవితంలో ఏం సాధించకుండానే రోడ్ల వెంట తిరుగుతూ మిగిలిపోయిన కోట్లాది మంది కంటే.. వంటింటికే పరిమితమైన ఎంతో మంది కంటే ఆర్జీవీ గొప్ప వాడు కదా? అతనికి కనీస గౌరవమన్నా ఇవ్వండి"
"ఈ మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడండి. ఇందులో నటించిన వారి నటనా సామర్థ్యానికి కాంప్లిమెంట్స్ ఇవ్వండి. ఆ అమ్మాయి అందం గురించి.. ఆమె తండ్రిగా నటించిన వ్యక్తి సహజ నటన గురించి కానీ.. మూడు పాత్రలతో 11 నిమిషాల్లో తానేం చెప్పాలనుకున్నదో చెప్పేసిన దర్శకుడ్ని అభినందించండి"
"ఈ చిన్న సినిమాలో ఉన్న నీతిని గుర్తించొచ్చుగా. తల్లిదండ్రుల స్పందనను గుర్తించొచ్చుగా. ఈ దేశంలో ఉన్న ఎంతోమంది మహిళలకు ఆర్జీవీ ఒక దూత లాంటి వాడని బలంగా నమ్ముతున్నా. తెలివైన వారు.. పరిణితి చెందిన వారు మాత్రమే వర్మను అర్థం చేసుకుంటారు. వర్మను అర్థం చేసుకోలేని వారు అన్ ఫాలో కావటం బెటర్. ఎందుకంటే.. మీరు క్రిటిక్ గా మారొద్దు. ఎందుకంటే.. ఆర్జీవీ అద్భుతమైన వ్యక్తి."
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/