సెన్సేషనల్ డైరెక్టర్ పేరు తెచ్చుకున్న రాంగోపాల్ వర్మ కెలుకుడు రోగాన్ని కూడా తెచ్చేసుకున్నట్టే ఉంది. ఏదైనా ఓ విషయాన్ని పట్టుకుంటే... తెగే దాకా లాడగంలో వర్మను మించిన వారు లేరనే చెప్పాలి. కాపు నేత వంగవీటి మోహన రంగా జీవితం ఆధారంగా తెరకెక్కించిన వంగవీటి చిత్రం తర్వాత అప్పటిదాకా ఉన్న మైండ్ సెట్ ను వర్మ ఒక్కసారిగా మార్చేసుకున్నారనే చెప్పాలి. అప్పటిదాకా సినిమాలతోనే కాలక్షేపం చేసిన వర్మ... ఆ తర్వాత రాజకీయాంశాలపై దృష్టి సారించారు.
ఈ క్రమంలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై పగబట్టిన వాడికి మల్లే వ్యవహరించడం మొదలెట్టారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నానంటూ ప్రకటించి... చంద్రబాబుపై వరుస విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా చంద్రబాబు బర్త్ డేను పురస్కరించుకుని ట్విట్టర్ లో వ్యంగ్యంగా ఓ ట్వీట్ పెట్టారు. ఈ ట్వీట్ పై పలువురు అసహనం వ్యక్తం చేయగా... అక్కడితో ఆగని వర్మ... మరింతగా రెచ్చిపోయి మరో తికమక ట్వీట్ పోస్ట్ చేశారు.
చంద్రబాబుకు బర్త్ డే గ్రీటింగ్స్ చెబుతూ తాను చేసిన ట్వీట్ ను కొందరు సరిగా అర్థం చేసుకోలేకపోయారని తనదైన శైలి వ్యాఖ్యలు చేసిన వర్మ... ఆ ట్వీట్ లోనూ చంద్రబాబును టార్గెట్ చేసేశారు. మొత్తంగా తనదైన కెలుకుడు రాజకీయాన్ని ఏమాత్రం మానుకునేది లేదంటూ వర్మ తన వైఖరిని బయటపెట్టేసుకున్నారు. అయితే చంద్రబాబును ఏ రీతిన అయితే వర్మ టార్గెట్ చేస్తున్నారో, నెటిజన్లు కూడా వర్మను అదే రీతిన టార్గెట్ చేస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు బర్త్ డే నాడు వర్మ రచ్చరచ్చ చేశారనే చెప్పాలి.