వర్మ సినిమాపై నెటిజన్ల దండయాత్ర

Update: 2018-01-26 08:10 GMT
పోర్న్ స్టార్ మియా మాల్కోవా స్వగతంతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) ఎన్ని వివాదాలకు వేదికైందో అంతకు అంత పాపులారిటీ సంపాదించుకుంది. టీవీ ఛానళ్లలో దీనిపై తెగ చర్చలు పెట్టేయడంతో జీఎస్టీపై జనాల్లో తెగ క్యూరియాసిటీ పెరిగిపోయింది. వర్మ ఏం తీశాడోనన్న ఉత్సుకతతో అందరూ ఒకేసారి జీఎస్టీ చూసేందుకు ప్రయత్నించడంతో సైట్ కాస్తా క్రాష్ అయింది.

http://godsextruth.online  సైట్ లో ఈరోజు ఉదయం జీఎస్టీ విడుదల చేస్తామని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు. దేశవ్యాప్తంగా ఉన్న నెటిజన్లంతా ఒక్కసారిగా ఆ సైట్ తెరిచేసరికి ఇంటర్నెట్ ట్రాఫిక్ ఎక్కువై అదేమో క్రాష్ అయింది. దాంతో మియా మాల్కావో ఆర్జీవీతో ఏం చెప్పిందో తెలుసుకోవాలనుకున్న ప్రేక్షకుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ఈ సైట్ క్రాష్ అయిన విషయం ఆర్జీవీ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ చూడటానికి చాలా హెవీ ట్రాఫిక్ ఉంది. దాంతో
godsextruth.online
అప్ గ్రేడింగ్ ఆలస్యం అవుతోంది. అప్ డేట్ అయిన వెంటనే సమాచారం ఇస్తాం’’ అంటూ రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ అకౌంట్లో పెట్టాడు.

జీఎస్టీ సినిమా కాదని.. సెక్స్ పై మియా మాల్కోవా స్వగతం మాత్రమే ఉంటుందని రామ్ గోపాల్ వర్మ క్లారిటీగానే చెప్పాడు. కాకుంటే దీనిపై వర్మ ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ ప్రచారం జరగడంతో నెటిజన్లపై దీనిపై బాగా ఆసక్తి పెరిగింది. అందుకే పండగ ఆఫర్లు ఉన్న సైట్ కు పోటెత్తినట్టు నెటిజన్లంతా ఆ సైట్ పై దండ యాత్ర చేశారు. వారి క్యూరియాసిటీ తీరాంలంటే ఆ సైట్ తిరిగి ఓపెన్ అయ్యేదాకా ఓపిక పట్టాల్సిందే. 
Tags:    

Similar News