లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' లో వీరంతా ఎవరు?

Update: 2019-01-29 10:08 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ప్రస్తుతం ఎన్టీఆర్‌ సెమీ బయోపిక్‌ 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌'ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే. ఎన్టీఆర్‌ జీవితంలోని పలు వివాదాస్పద విషయాలను ఈ చిత్రంలో చూపిస్తానంటూ ముందే వర్మ ప్రకటించాడు. బాలకృష్ణ, క్రిష్‌ ల కాంబినేషన్‌ లో తెరకెక్కిన సినిమాలో చూపించని నిజాలను తన సినిమాలో చూపిస్తానంటూ మొదటి నుండి చెబుతున్న వర్మ సినిమా షూటింగ్‌ ను ముగింపు దశకు తీసుకు వచ్చాడు. ఈ చిత్రంలోని పాత్రలను మెల్ల మెల్లగా పరిచయం చేసిన వర్మ సినిమాకు సంబంధించిన స్టిల్స్‌ ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ హడావుడి సృష్టిస్తున్నాడు.

తాజాగా ట్విట్టర్‌ లో కొన్ని ఫొటోలు పోస్ట్‌ చేశాడు. వారి బాడీలాంగ్వేజ్‌ - కాస్ట్యూమ్స్‌ చూస్తూ ఉంటే ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల పాత్రలు అయ్యి ఉంటుందనిపిస్తుంది. లక్ష్మీ పార్వతిని ఆగ్రహంగా చూస్తున్న వీరంతా ఎవరై ఉంటారు అంటూ వర్మ ఈ ఫొటోలను పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోల్లో ఉన్నది హరికృష్ణ - బాలకృష్ణ ఇంకా ఇతర ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు అనే విషయం అందరికి అర్థం అవుతుంది. అంతకు ముందు చంద్రబాబు నాయుడుగా నటించిన వ్యక్తి ఒక కాళును తాకుతున్న ఫొటో పోస్ట్‌ చేశాడు. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు, ఏం చేస్తున్నాడు అంటూ వర్మ పోస్ట్‌ చేశాడు. వర్మ ట్వీట్‌ చేస్తున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

'ఎన్టీఆర్‌' లోని పాత్రల కంటే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ లోని పాత్రలకు నటీనటులు బాగా సెట్‌ అయ్యారంటూ మరోసారి సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల తేదీ విషయంలో వర్మ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. 'ఎన్టీఆర్‌ మహానాయకుడు' డేట్‌ ఫిక్స్‌ అయిన తర్వాత వర్మ తన 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాడేమో చూడాలి.

Tags:    

Similar News