డైరక్టర్ బుగ్గపై వర్మ ముద్దులు

Update: 2017-07-05 16:58 GMT
సంచలనాలు సృష్టించాలి.. ఇలాంటి నిర్ణయానికి కనుక రామ్ గోపాల్ వర్మ వచ్చాడంటే.. ఇక ఆయన్ను ఆపడం ఎవరితరం కాదు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో నెట్ జనాల ముందుకు వస్తూ.. డిఫరెంట్ గా చేసే ఎటెంప్ట్స్ ఆశ్చర్యపరుస్తుంటాయి.. అఫ్ కోర్స్ కొన్నిసార్లు చాలామందికి మండిస్తుంటాయి.

ఇప్పటివరకూ ఇతరులపై రాళ్లేసి పబ్బం గడుపుకున్న వర్మ.. ఇప్పుడు తనను తనే టార్గెట్ చేసుకుంటున్నాడు. ఒకప్పటి తన రైటర్.. ఇప్పుడు పెద్ద డైరక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ తో తనకు మాంచి స్నేహం ఉందని చెప్పాలన్నది వర్మ టార్గెట్. కానీ ఆ పాయింట్ ను అలాగే చెప్పేస్తే.. అది వర్మ స్టైల్ అవదు. అందుకనే ఇన్ స్టాగ్రామ్ లో తామిద్దరి ముద్దుల ఫోటోలను తెగ షేర్ చేసేస్తున్నాడు. వర్మ- అనురాగ్ కశ్యప్.. ఇద్దరూ ఒకరినొకరు బుగ్గల మీద ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు దర్శనమిస్తున్నాయి. వీటికి సుదీర్ఘమైన వివరణ కూడా ఇచ్చాడు వర్మ.

'ఎవరు మా గురించి ఎంత భయంకరంగా అనుకున్నా పర్లేదు. మా లైంగిక ప్రవృత్తిపై వాళ్లు అనుమానపడచ్చు.. కానీ మేమిద్దరం ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటాం. ఇప్పుడే అనురాగ్ కశ్యప్ ను ఓ రెస్టారెంట్ లో కలిశాను. అతని పెదాలు నా బుగ్గలపై ఉన్నపుడు.. అత్యంత సెక్సీగా ఉండే అమ్మాయి పెదాలు నా నోటిపై ఉన్నదాని కంటే బెటర్ గా ఫీల్ అవుతున్నా' అంటూ పోస్టింగ్ చేశాడు వర్మ. ఇదీ తంతు. మరి మీరు ఈ ఫోటోలను చూసి ఏమని అనుకుంటారో మీ ఇష్టం!!
Tags:    

Similar News