అనుకున్నంతా అయ్యింది. చివరి నిమిషంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రీమియర్ కు మంగళగిరి కోర్టు బ్రేకు వేసి ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ మీదే అనుమానాలు వచ్చేలా చేసింది. తెలంగాణా థియేటర్లకు సంబంధించి ఆన్ లైన్ టికెటింగ్ ప్లాట్ ఫారంస్ మీద ఇంకా బుకింగ్ జరుగుతూనే ఉంది. రేపటి షోలకు అధిక శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. అవి క్యాన్సిల్ అయినట్టు కాని రీ ఫండ్ ఇస్తామని కాని కస్టమర్లకు ఎలాంటి సమాచారం లేదు. ఇటు వర్మ కూడా సోషల్ మీడియా ఇంకా దీని గురించి నేరుగా స్పందించలేదు. లీగల్ టీంతో చర్చల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం.
సో రేపటి విడుదల మీద అనుమానాల మేఘాలు నిజమైనట్టే. ఇదిలా ఉండగా కోర్ట్ తమకు వచ్చే నెల 4వ తేదిన స్క్రీనింగ్ వెయ్యమని ఆ తర్వాత తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పినట్టుగా మరో సమాచారం ఉంది. ఇవన్ని పూర్తి వివరాలతో బయటికి రావడానికి ఇంకొంత టైం పడుతుంది కాని వర్మ తక్షణ కర్తవ్యం ఏంటని అతని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు
ప్రాక్టికల్ గా చూసుకుంటే వర్మ ఇప్పటికిప్పుడు చేయగలిగింది ఏమి లేదు. చట్టం ప్రకారం ఎన్నికల సమయంలో బయోపిక్కులు విడుదల చేయకూడదు అనే నిబంధనలను అనుసరించే ప్రస్తుత తీర్పు వచ్చింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ పూర్తి స్థాయి బయోపిక్ కాకపోయినా టిడిపి వ్యవస్థాపకుడి జీవితం మీద తీసింది కాబట్టి ఖచ్చితంగా ఆ రూల్ పరిధిలోకే వస్తుంది. పైగా యుట్యూబ్ తో సహా ఇంకెక్కడా వదలకూడదు అని స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఇంటర్వ్యూలో వర్మ చెప్పినట్టు ఆ ఛాన్స్ కూడా పోయింది.
ఇదంతా తెమిలే లోపు పోలింగ్ తేది ప్లస్ పుణ్యకాలం ఏప్రిల్ 11 గడిచిపోయేలా ఉంది. వర్మ ఆశించిన ప్రయోజనం ఏమిటో కాని ఆ తర్వాత ఇప్పుడున్న బజ్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద చల్లబడటం ఖాయం. సుప్రీమ్ కోర్ట్ కు వెళ్ళే ఆలోచనలో వర్మ ఉన్నట్టు చెబుతున్నారు కాని అక్కడా ఏదైనా అద్భుతం జరిగే అవకాశం లేదని న్యాయ నిపుణల మాట. చూడాలి ఏం జరుగుతుందో.