ఎక్కడ సైలెంట్ అవ్వాలో వర్మకు తెలుసు

Update: 2018-02-03 06:13 GMT
మాజీ శృంగార తార షకీలా అంటే ఒకప్పుడు ఎంతగా పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె సినిమాలు వస్తున్నాయంటే చాలా అప్పట్లో మలయాళం స్టార్ హీరోలు వారి సినిమాల రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకునేవారు. అయితే చాలా కాలం తరువాత ఈ మధ్య ఆమె వార్తల్లో నిలుస్తోంది. శీలవతి అనే ఒక హర్రర్ మూవీ ద్వారా కొత్త తరహాలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అంతే  కాకుండా సినిమా ప్రమోషన్స్ లలో కూడా పాల్గొంటోంది.

అయితే ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొంచెం ఘాటుగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. తన వ్యక్తిగత విషయాల గురించే కాకుండా ఇతర కాంట్రవర్షియల్ మ్యాటర్లపై కూడా ఘాటుగా మాట్లాడింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ తీసిన గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ గురించి కూడా స్పందించింది. అంతే కాకూండా తనకు అవకాశం లభిస్తే సీక్వెల్ లో నటించేందుకు సిద్దమే అని తెలిపింది. అయితే ఈ కామెంట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి.

రామ్ గోపాల్ వర్మ కూడా ఇంట్రెస్ట్ చూపుతున్నారని కొంత మంది ఫెక్ న్యూస్ లను క్రియేట్ చేస్తున్నారు. అయితే అందులో ఎలాంటి నిజం లేదు. సాధారణంగా ఇలాంటి న్యూస్ లపై వర్మ స్పందించకుండా ఉండలేడు. షకీలా అలా చెప్పిందంటే తప్పకుండా ఎదో ఒక కౌంటర్ వేస్తాడు అని అందరు అనుకున్నారు. కానీ వర్మ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో షకీలా అభిప్రాయాన్ని ఆయన ఏ మాత్రం ఇష్టపడటం లేదని తెలుస్తోంది. పైగా షకీలాతో జిఎస్.టి. ఏంటి? అందుకే ఎక్కడ సైలెంట్ అవ్వాలో వర్మకు బాగా తెలుసు.



Tags:    

Similar News