ఎన్టీఆర్ లో అన్ని కొత్త మొహాలే

Update: 2018-11-27 06:52 GMT
రామ్ గోపాల్ వర్మ తన నిర్మాణంలో రూపొందిన భైరవగీత ప్రమోషన్ కోసం ఎడతెరిపి లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు. అందులో భాగంగా దాని దర్శకుడు సిద్దార్థ పనితం గురించి గొప్పగా చెబుతూనే పనిలో పనిగా  నిర్మాణంలో ఉన్న లక్ష్మిస్ ఎన్టీఆర్ గురించి కూడా పబ్లిసిటీ తెచ్చేసుకుంటున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేశానంటున్న వర్మ ఇందులో అంతా కొత్త వాళ్ళే ఉంటారట. ఎక్కడో తమిళనాడులో చంద్రబాబు నాయుడుని పోలిన వ్యక్తి ఉంటే సోషల్ మీడియా సహాయంతో వెతికి మరీ పట్టుకొచ్చిన వర్మ మిగలిన పాత్రలకు అలాగే అదే పోలికలతో ఉన్నవాళ్ళను ఇప్పటికే తీసుకున్నాడని ఆయనే చెబుతున్నాడు.

సినిమాలు ఎలా తీసినా నిజజీవిత వ్యక్తుల కథలను తీసుకున్నప్పుడు ఒక్క కాస్టింగ్ విషయంలో మాత్రం వర్మ మార్క్ ప్రత్యేకంగా కనపడుతుంది. కిల్లింగ్ వీరప్పన్-వంగవీటిలో పాత్రలను చూస్తే అరె ఎలా వెతికి పట్టుకున్నాడు అని ఆశ్చర్యపోయిన మాట వాస్తవం. ఇప్పుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ కు సైతం అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ముందు చెప్పినట్టు జనవరి 24 దీన్ని విడుదల చేయడం లేదు. షూటింగ్ పూర్తవ్వడానికే ఆ నెలాఖరు అవుతుందట. సో ఫిబ్రవరి లేదా మార్చ్ లో ఉండొచ్చు. ఎన్టీఆర్ మహానాయకుడుతో పోటీ ఉండదు అనుకుంటే వర్మ ప్లాన్ ప్రకారం క్లాష్ అవ్వాలని గట్టిగా డిసైడ్ అయినట్టు ఉన్నాడు.

అధికారికంగా ఇంకా ప్రకటించనప్పటికీ మహానాయకుడి విడుదల తేది గురించి ఇంకా క్లారిటీ రావడం లేదు. జనవరి 24 నుంచి వాయిదా వేసే ఆలోచన ఉన్నట్టు కాస్త గట్టిగానే ప్రచారం జరుగుతోంది. అదే కనక జరిగితే ఎంత వద్దనుకున్న దానికి పోటీగా తన లక్ష్మిస్ ఎన్టీఆర్ ని వదిలే ప్లాన్ లో వర్మ ఉన్నట్టు కనిపిస్తోంది.
    

Tags:    

Similar News