అందరూ నడిచే దారిలో నడిస్తే నా స్పెషల్ ఏముంది? అన్నట్లుగా ఉంటుంది వర్మ స్టైల్. తానెవరికీ భయపడనని.. భయం అన్నది తనకు లేనట్లుగా.. బెదిరింపులు.. హెచ్చరికలు లాంటివి తన పిచ్చ లైట్ అన్నట్లుగా వ్యవహరించే వర్మ.. ఏ విషయంలోనూ రాజీ పడరన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. అందరూ తీసిన యాంగిల్ తీస్తే మజా ఏముంటుంది? బయటకు రాని నిజాలు.. చీకట్లో దాగిన సత్యాల్ని బయటకు లాగటం.. ప్రజలకు తెలిసేలా చేయటం తన కర్తవ్యమని.. అందుకే ఆ దేవుడు తనను భూలోకానికి పంపినట్లుగా కబుర్లు చెప్పే వర్మ.. తాజాగా టైగర్ కేసీఆర్ టైటిల్ ప్రకటనతో తానేమిటో చెప్పేశారు.
అందరికి ఒకేలాంటి రూల్స్ వర్తించవని.. కేసీఆర్ లాంటి వారికి ప్రత్యేక మినహాయింపులు ఉంటాయన్న విషయం వర్మ కూడా ఒప్పుకున్నట్లుగా చెప్పక తప్పదు. తాజాగా ఆయన ప్రకటించిన టైగర్ కేసీఆర్ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టైటిల్.. దాని కింద క్యాప్షన్ చూస్తేనే సినిమా కంటెంట్ ఏముంటుందో ఇట్టే అర్థమయ్యే పరిస్థితి. అందరికి తెలిసిన విషయాల్ని తీస్తే.. అందులో వర్మ గొప్పతనం ఏముంటుంది?
ఎవరూ టచ్ చేయని యాంగిల్ ను తీసుకొని.. విన్నంతనే ఉలిక్కిపడే కంటెంట్ ను తెర మీదకు తెస్తానని దమ్ముగా ప్రకటించే వర్మ.. తాజా సినిమా విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారని చెప్పక తప్పదు. ఎవరేం అనుకున్నా.. వర్మ దమ్మున్నోడు భయ్ అనే మాటలకు భిన్నంగా టైగర్ కేసీఆర్ టైటిల్ ఉందని చెప్పక తప్పదు.
కేసీఆర్ ను ఉద్దేశించి ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఇటీవల లేవనెత్తిన విషయాల్ని టచ్ చేయకుండా.. కేసీఆర్ ను పొగడటమే పనిగా పెట్టుకొని.. ఆయన్ను ఆకాశానికి ఎత్తే పని తాజా సినిమాలో ఉంటుందంటున్నారు. అదే చేయాల్సి వస్తే.. వర్మనే ఎందుకు.. టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు. మరి.. మిగిలిన వారికి భిన్నమైన దమ్ము యాంగిల్ మిస్ కావటం ఏమిటి ఆర్జీవీ?