లక్ష్మి పార్వతికి వర్మ హ్యాండ్ ఇస్తాడా?

Update: 2018-11-26 11:26 GMT
అంతే వర్మను గుడ్డిగా నమ్మి అతన్ని ఫాలో అయిపోతే ఎంత డేంజరో అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే తప్ప మాటల్లో చెప్పేది కాదు. ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం ఏదైనా మాట్లాడే వర్మ తూచ్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు అంటూ మాట మార్చడం ఎన్ని సార్లు జరిగిందో లెక్క బెట్టడం కష్టం. లక్ష్మి పార్వతి గారు కూడా ఇలా వర్మ బారిన పడే బ్యాచ్ లో చేరేలా ఉన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ ఇటీవలే లక్ష్మీస్ ఎన్టీఆర్ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. రెండో పెళ్లి అయ్యాక ఎన్టీఆర్ జీవితంలో ఏం జరిగింది అనేది పచ్చి నిజాల రూపంలో తీస్తానని ప్రకటించి లక్ష్మి పార్వతితో పాటు కొందరు రాజకీయ నాయకులతో వర్మ ఓపెనింగ్ రోజు ఎంత హంగామా చేసాడో చూసాంగా.

ఆ సమయంలోనే లక్ష్మి పార్వతి గారితో అన్ని చర్చించాకే లక్ష్మిస్ ఎన్టీఆర్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నానని చెప్పి ఆవిడ రాసుకున్నాక కూడా అంత చెబుతాను అని చెప్పాడు. తీరా ఇప్పుడు మాత్రం మాట మార్చేసాడు వర్మ. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా స్క్రిప్ట్ కరెక్టా కాదా అని చూపించుకునే ఉద్దేశంలో తాను లేనని  ప్రాజెక్టును నమ్మకమే నడిపించాలని లక్ష్మి పార్వతి నన్ను నమ్మి నిశ్చితగా ఉండాలని సెలవిచ్చేసాడు. అంటే స్క్రిప్ట్ ని ఆవిడకు వినిపించే సమస్యే లేదని తెల్చేసినట్టే.

అందరు కొత్తవాళ్లతోనే లక్ష్మిస్ ఎన్టీఆర్ రూపొందుతుందని దీనికి స్టార్స్ అక్కర్లేదని చెబుతున్న వర్మ వంగవీటి టైం లో జరిగిన పరిణామాలను గుర్తుకు తెస్తున్నాడు. అప్పుడూ ఇలాగే కేవలం నిజాలు మాత్రమే చూపిస్తానని చెప్పి ఒకే కోణంలో సినిమా తీసారని రంగా వర్గీయులు భగ్గుమన్నారు. ఇప్పుడు లక్ష్మిస్ ఎన్టీఆర్ అదే దారిలో వెళ్తుందా లేక కొత్త మలుపు ఏదైనా తీసుకుంటుందా వేచి చూడాలి
Tags:    

Similar News