రామ్‌గోపాల్ వర్మ అనేకంటే వివాదాల వర్మ అంటేనే సబబు. నిజం మాట్లాడాలన్నా, నిజాయితీగా మాట్లాడాలన్నా రామూ నాలుక మడతపడదు. అబద్ధాన్ని నిజంలా, నిజాన్ని అబద్ధంలా చెప్పేసే దమ్మున్నోడు. అందుకే అతడి నోటి నంచి ఏ మాట వచ్చినా సెన్సేషన్ అవుతుంది.
లేటెస్టుగా జ్యోతిలక్ష్మి గొప్పతనాన్ని వర్ణిస్తూ మిగతా హీరోల్ని దెప్పి పొడిచాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన జ్యోతిలక్ష్మి చిత్రంలో ఛార్మి రియల్ హీరోగా కనిపిస్తుంది. అందులో ఉన్న ఎమోషన్స్ హీరోయిక్‌గా ఉంటాయని పొగిడేశాడు. చాలామంది హీరోల కంటే జ్యోతిలక్ష్మిలోని ఎమోషన్స్ బావుంటాయని అన్నాడు. ఛార్మిని పూరీ హీరోల కంటే బాగా చూపించాడని పొగిడాడు. టైటిల్ క్యారెక్టరైజేషన్ అమాయకురాలిలాగా కనిపిస్తుంది. కానీ అది కావాలనే అలా కనిపిస్తుంది. సందేశాన్ని వినోదంతో పాటే ఎలా చూపించాలో అలా చూపించాడు పూరీ అంటూ తెగ పొగిడేశాడు.
శిష్యుడిని ప్రమోట్ చేయడానికి రామూ ఎమోషన్ అవుతున్నాడనే అనిపిస్తోంది ఈ వ్యాఖ్యలు వింటుంటే. అయితే రామూ చెప్పినన్ని ఎమోషన్స్, వినోదం, సందేశం పక్కాగా ఉంటే జ్యోతిలక్ష్మికి సక్సెస్ షురూ.. ఏ తేడా వచ్చినా రామూలోని నిజాయితీని అబద్ధాల కోరు డామినేట్ చేసినట్టు...