ఎప్పుడు సినిమాలు మొదలుపెడతాడో తెలియదు.. ఎప్పుడు పూర్తి చేస్తాడో తెలియదు.. ఉన్నట్లుండి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. తెలుగులో వర్మ తన చివరి సినిమాగా పేర్కొన్న ‘వంగవీటి’ విషయంలోనూ కొన్ని నెలల కిందట ఇలాగే షాకిచ్చాడు. సైలెంటుగా ట్రైలర్ రిలీజ్ చేసి.. డిసెంబరు 23న సినిమా రిలీజ్ అన్నాడు. ఆ తర్వాత ఈ చిత్రం వార్తల్లో లేదు. ముంబయికి మకాం మార్చేసి ‘సర్కార్-3’ తీసుకుంటున్న వర్మ.. వంగవీటి ప్రమోషనల్ యాక్టివిటీస్ కూడా ఏం ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపించలేదు. విడుదలకు ఇంకో నాలుగు వారాల టైం మాత్రమే ఉండగా.. ‘వంగవీటి’ అనుకున్న ప్రకారం డిసెంబరు 23న వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది.
వర్మ ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ‘వంగవీటి’ మీద జనాల్లో బాగా క్యూరియాసిటీ ఉంది. ‘రక్తచరిత్ర’ తర్వాత అంత ఆసక్తి రేకెత్తిస్తోందీ చిత్రం. అందుకు ఈ చిత్రం తెరకెక్కిన నేపథ్యమే కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. డిసెంబరు 23నే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకంటే మాత్రం ముందు ఫస్ట్ కాపీ తీసుకెళ్లి సెన్సార్ వాళ్ల ముందు పెట్టాలి. అనేక వివాదాస్పద అంశాల ప్రస్తావన ఉంటుంది కాబట్టి దీనికి సెన్సార్ సర్టిఫికెట్ రావడం అంత ఈజీ కాదు. వాళ్లేమైనా అభ్యంతరాలు చెప్పొచ్చు. మార్పులు సూచించొచ్చు. కోతలు వేయొచ్చు. అందుకు అనుగుణంగా మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. సెన్సార్ సర్టిఫికెట్ వచ్చేసిందంటే ఇక సినిమా విడుదలకు ఏ ఇబ్బందీ లేనట్లే.