గీతాంజలి - శంకరాభరణంలాంటి క్లాసిక్ సినిమాల్ని టైటిల్ ని వాడేసిన కోన వెంకట్ తదుపరి `పాతాళ భైరవి`పై కన్నేశాడని ప్రచారం సాగింది. ఇప్పటికే ఆయన ఓ కథ కూడా తయారు చేశాడని, అది కూడా కాన్సెప్ట్ కథే అని, దాన్ని పాతాళ భైరవి పేరుతో తీయబోతున్నాడని చెప్పుకొన్నారు. కానీ ఆ టైటిల్ ని కోన వాడట్లేదట. ఆయన గురువులాంటివాడైన రామ్ గోపాల్ వర్మ పాతాళభైరవి సినిమా తీయబోతున్నాడట. అందులో హీరో కూడా సెట్ అయినట్టు తెలిసింది. ఆ హీరో ఎవరో కాదు... మెగా కుటుంబానికి చెందిన ఆరడుగుల వరుణ్ తేజ్.
నిర్మాత సి.కళ్యాణ్ ఎప్పటికైనా పాతాళభైరవిలాంటి సినిమా చేయాల్సి వుందని నిన్ననే ప్రకటించాడు. ఆయనే వరుణ్ తేజ్ - వర్మల కాంబినేషన్ ని సెట్ చేశాడని తెలిసింది. వర్మ ఇదివరకే అమ్మ పేరుతో ఓ స్క్రిప్టు రాసుకొన్నాడు. కాళీమాత నేపథ్యంలో ఆ కథ సాగుతుందట. గ్రాఫిక్స్ కి ప్రాధాన్యమున్న ఆకథ అచ్చం పాతాళభైరవిని పోలి వుంటుందట. ఆ కథని విన్న సి.కళ్యాణ్ నేనే నిర్మిస్తానని ముందుకు రావడంతో పాటు వరుణ్ తేజ్ ని కూడా ఒప్పించినట్టు తెలిసింది. వరుణ్ తో ప్రస్తుతం సి.కళ్యాణ్ లోఫర్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త సినిమాని హడావుడిగా వెల్లడించడం ఇష్టం లేక నిన్న సి.కళ్యాణ్ పాతాళభైరవిలాంటి సినిమా చేయాలని ఉందని చెప్పుకొచ్చాడు. కానీ అతి త్వరలోనే ఆ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.