నటి శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తర్వాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. శ్రీరెడ్డి పై జాతీయ - అంతర్జాతీయ మీడియాలో కూడా కథనాలు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా రంగానికే పరిమితం కాదని - కార్పొరేట్ కంపెనీలు - తదితర ఆఫీసులలో కూడా ఈ సమస్య ఉందని వర్మ షాకింగ్ కామెంట్స్ చేశారు. స్త్రీ పురుషులు కలిసి పనిచేసే ప్రతిచోటా...దాదాపుగా కాస్టింగ్ కౌచ్ ఉంటుందని, కాకపోతే సినీ తారలు మీడియాకు ఎక్కువగా ఎక్స్ పోజ్ అవుతారని చెప్పారు. ఓ యూట్యూబ్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
గతంలో తన సినిమాల్లో నటించేందుకు హీరోయిన్ల కోసం ఆడిషన్స్ నిర్వహించానని, హీరోయిన్ గా ఎంపికైన ఓ అమ్మాయి తనను డైరెక్ట్ గా ఓ ప్రశ్న అడిగిందని వర్మ గుర్తు చేసుకున్నారు. సినిమాలో హీరోయిన్ చాన్స్ ఇచ్చినందుకు మీతో కాంప్రమైజ్ అవ్వాలా ....అని ఆ అమ్మాయి తనను అడిగిందని - తాను కాంప్రమైజ్ కానని - అవకాశం రాకపోయినా పర్లేదని వాపోయిందని వర్మ అన్నారు. బయట చూసిన పరిస్థితుల వల్ల ఆ అమ్మాయి అలా అడిగి ఉంటుందని చెప్పారు. తన సినిమాలో చాన్స్ ఇస్తానని - కాంప్రమైజ్ కావాలని ఓ బడా ఫేమస్ ప్రొడ్యూసర్ తనను అడిగారని ఓ అమ్మాయి చెప్పిందన్నారు. ఆ విషయాన్ని తాను నమ్మలేదని - ఆ నిర్మాత అలాంటివాడు కాదని చెప్పానని గుర్తు చేసుకున్నారు. అయితే, ఆ అమ్మాయి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి ఆ నిర్మాత నోటితోనే ఆ విషయాన్ని చెప్పించిందని విని తాను షాక్ అయ్యానని వర్మ అన్నారు.
కాంప్రమైజ్ అంటే అర్థం కాలేదని - ఆ అమ్మాయి అడిగితే.....‘యూ నో ఎవ్రీథింగ్’ - అది అందరికీ తెలిసిన పదమే కదా అని ఆ నిర్మాత సమాధానమిచ్చారని - ఆ గొంతు తాను గుర్తు పట్టానని వర్మ అన్నారు. కాంప్రమైజ్ అంటే మీతో పడుకోమనా అని ఆ అమ్మాయి అడగ్గానే....అన్నీ తెలిసి మళ్లీ నన్ను అడుగుతావేంటి అని ఆయన సమాధానమిచ్చారని, అది విని షాక్ అయ్యానని వర్మ అన్నారు. మీ సినిమాలో ఫలానా హీరో.. ఫలానా డైరెక్టర్.....హీరోయిన్ ని డిసైడ్ చేస్తారు కదా అని అడిగితే....``ఏయ్ హూ ఆర్ దే.. వాళ్లను ఇండస్ట్రీ నుంచి తన్ని తరిమేస్తా నా గురించి నీకు తెలియదు`` అని హీరో - డైరెక్టర్ పేర్లను ఆ నిర్మాత బయటకు చెప్పేశాడని వర్మ గుర్తు చేసుకున్నారు. ఆ కాల్ ను ఆ అమ్మాయి రికార్డు చేసిందని - యూట్యూబ్ లో పెడితే వైరల్ అవుతుందని - కానీ అలా చేస్తే అవకాశాలు పోతాయని భయపడిందని చెప్పారు. ఈ అమ్మాయే కాదు....దాదాపు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే ప్రతి అమ్మాయి ఫోన్ లో చాలామంది సీక్రెట్లుంటాయని, మన ఊహకు కూడా అందని నిజాలు వారికి తెలుసని వర్మ బాంబు పేల్చారు. ప్రస్తుతం వర్మ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అయింది.