నాగ్ వర్మకు గట్టిగానే చెప్పినట్లున్నాడే..

Update: 2017-11-21 09:24 GMT
రామ్ గోపాల్ వర్మ తనతో మళ్లీ ఓ సినిమా చేయడానికి కథ చెప్పినపుడు.. ఈ సినిమా స్క్రిప్టు సమయంలో.. సినిమా తీసేటపుడు ఇంకే వ్యాపకాలూ పెట్టుకోనని హామీ ఇస్తేనే చేస్తానంటూ షరతు పెట్టినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మాటను వర్మ తు.చ తప్పకుండా పాటించినట్లే ఉన్నాడు. నాగార్జునతో సినిమా తన కెరీర్ కు చాలా కీలకం అని వర్మ భావిస్తున్నట్లు ఉన్నాడు. అందుకే నాగార్జునతో ఆ మీటింగ్ అయిన దగ్గర్నుంచి వర్మ ఇంకే విషయం గురించి పట్టించుకోవట్లేదట. వర్మకు ఒకేసారి నాలుగైదు ఐడియాల మీద పని చేయడం అలవాటు. తన అసిస్టెంట్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ.. వాళ్లకు ఇన్ పుట్స్ ఇస్తూ.. స్క్రిప్ట్ వర్క్ చేయిస్తుంటాడు.

కానీ నాగార్జున సినిమా ఓకే అయ్యాక ఇలాంటి వ్యవహారాలకు వర్మ ఫుల్ స్టాప్ పెట్టేశాడట. వేరే ప్రాజెక్టులు వేటి గురించీ అతను పట్టించుకోవట్లేదట. ఎన్టీఆర్ జీవిత కథతో తీస్తానన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ను కూడా వర్మ పక్కన పెట్టేశాడట. దీనికి సంబంధించి రీసెర్చ్ కూడా ఆగిపోయిందట. ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన టెక్నీషియన్లందరూ ఎవరి పనుల్లో వాళ్లు పడిపోయారట. వర్మ ఐదారు నెలల పాటు నాగ్ సినిమా నుంచి బయటికి రాడట. దీంతో వర్మ ముందు ప్రకటించినట్లు వచ్చే ఏడాది అక్టోబర్లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వస్తుందా అన్నది సందేహమే. గతంలో ఎన్నో సినిమాలు అనౌన్స్ చేసి.. మధ్యలో వదిలేసిన వర్మ ఆరు నెలల తర్వాత తన మూడ్ ను బట్టి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను పక్కన పెట్టేసినా ఆశ్చర్యం లేదని కూడా అంటున్నారు. మరి ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జనాల పరిస్థితేంటి?
Tags:    

Similar News