వర్మ ఎవరిని పొగిడాడో తెలుసా?

Update: 2016-08-30 10:06 GMT
రామ్ గోపాల్ వర్మకు.. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు ఉన్న శతృత్వం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన పుస్తకం ‘నా ఇష్టం’లో తనను భయపెట్టే పది విషయాలు అంటూ ఓ లిస్టు ఇచ్చి.. అందులో ‘కరణ్ జోహార్ సినిమాలు’ అని కూడా పేర్కొన్నాడు వర్మ. కరణ్ తీసే ఫ్యామిలీ సినిమాలు చాలా డ్రమటిగ్గా ఉంటాయని.. చాలా బోరింగ్ అని.. వాటిని భరించడం తన వల్ల కాదని అంటుంటాడు వర్మ.

ఈ విషయంలో కరణ్.. వర్మ మధ్య కొన్నిసార్లు సోషల్ మీడియాలో మాటల యుద్ధం కూడా సాగింది. ఐతే ఎప్పుడూ కరణ్ ను విమర్శించే వర్మ.. ఈ రోజు ఆశ్చర్యంగా అతణ్ని పొగిడాడు. చాన్నాళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన కరణ్ జోహార్.. రణబీర్ కపూర్-ఐశ్వర్యా రాయ్-అనుష్క శర్మ కాంబినేషన్లో ‘ఆయే దిల్ హై ముష్కిల్’ అనే సినిమా తీశాడు. ఇవాళే ఈ సినిమా టీజర్ రిలీజైంది. మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అందరూ ఈ టీజర్ని తెగ పొగిడేస్తున్నారు.

ఐతే మిగతా వాళ్ల మాటేమో కానీ.. వర్మ ఈ టీజర్ మీద పొగడ్తలు గుప్పించడమే ఆశ్చర్యం కలిగించే విషయం. ఈ టీజర్ రిలీజ్ చేసి ఈ రోజు కరణ్ చాలామందికి ఆనందం కలిగించాడంటూ ట్వీట్ పెట్టాడు వర్మ. తమాషా చేశాడో.. సీరియస్ గానే అన్నాడో కానీ.. వర్మ ట్వీట్ చూసి కరణ్ కూడా సంతోషించాడు. నా టీజర్ సంగతేమో కానీ.. నీ ట్వీట్ తో నేను చాలా సంతోషించాను అంటూ రిప్లై ఇచ్చాడు కరణ్. ఎప్పుడూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే వర్మ.. కరణ్ ఇలా పాజిటివ్ గా మాట్లాడుకోవడం వాళ్లను ఫాలో అయ్యేవాళ్లకు చాలా కొత్తగా అనిపిస్తోంది.
Tags:    

Similar News