క్రిస్మస్ రోజున.. వర్మ స్టైల్ ట్వీట్స్..

Update: 2015-12-25 09:41 GMT
ప్రతీ సందర్భానికీ, పండుగకు తన ఉద్దేశ్యాలను, ఫీలింగ్స్ ను వివాదాస్పద చిత్రాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్వీట్స్ చేస్తుంటాడు. ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగానూ అదే తరహా ట్వీట్లు పెట్టి వార్తల్లో నిలిచాడు. "జీసస్ అందరినీ ప్రేమిస్తే.. ఐసిస్ ని కూడా ప్రేమిస్తాడా-జస్ట్ ఆస్కింగ్" ఇదీ వర్మ మొదటి ట్వీట్. ఇలా అడగడంతో మొదలుపెట్టి, ఇక చెలరేగిపోయాడనే చెప్పాలి.

"ఏసుక్రీస్తు - అల్లా ఇద్దరూ డైరెక్టుగా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసుకుంటే.. జీసస్ గెలుస్తాడని అనుకుంటున్నా.. ఆయన కండలు చూస్తే నాకు అలా అనిపిస్తోంది. రోమన్స్ జీసస్ ను అంత క్రూరంగా, కిరాతకంగా చంపినపుడు, అదే ఐసిస్ ఉగ్రవాదులు అయితే.. ఇంకెంత కఠినంగా చంపేవారే"అంటూ తన అనుమాన్ని వెలిబుచ్చాడు. "నేనో విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నా.. జీసస్ అందరినీ ప్రేమిస్తాడని క్రైస్తవులు నమ్ముతారు కదా.. మరి ఐసీస్ లీడర్ అబూ బకర్ ని కూడా జీసస్ ప్రేమిస్తాడా" అంటూ ప్రశ్నించాడు రామ్ గోపాల్ వర్మ. ఈయన ట్వీట్స్ ఇక్కడితో ఆగిపోలేదు.

"ఒక వేళ జీసస్ కనుక అబూ బకర్ నుంచి ఐసిస్, అల్ ఖైదా మెంబర్స్ అందరినీ ప్రేమించేటట్లయితే.. అప్పుడు అమెరికన్లు మసీదులను వెతకడం మానేసి, తమ దేవుడి విషయంలోనే రివ్యూ చేసుకోవాలి" అంటూ ఓ సూచన కూడా చేశాడు. ఇక చివరగా "మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మిస్టర్ జీసస్,, శాంటా ఇచ్చిన చాకొలేట్స్ తినేశాక.. ఐసిస్ విషయంలో నువ్వేమన్నా చేయగలవేమో చూడు.. నాకు డౌటే" అంటూ జీసస్ పై తన ట్వీట్స్ ని ముగించాడు వర్మ.
Tags:    

Similar News