ప్రపంచంలో జరిగే విషయాలు పెద్దవైనా - చిన్నవైనా వాటి వాటి ప్రాముఖ్యతపై తనదైన శైలిలో స్పందిస్తుంటారు వర్మ. ట్విట్టర్ వేదికగా ఇప్పటివరకూ వర్మ చేసిన సంచలన ప్రకటనలు అన్నీ ఇన్నీ కాదు. సమాజంపైనా - దేవుడిపైనా - తోటి ఇండస్ట్రీ వ్యక్తులపైనా - క్రికెటర్లపైన.. ఆఖరికి కోర్టు తీర్పులపై కూడా వర్మ తనదైన స్టైల్ లో స్పందిస్తుంటారు. తద్వారా అర్ధవంతమైన చర్చకు కూడా తలుపులు తెరుస్తుంటారు. అయితే వర్మ తాజాగా అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ పై ట్విట్టర్ లో స్పందించారు.
ఇది అతిగా స్పందించడమా - అర్ధవంతంగా స్పందించడమా - పుష్కలమైన వెటకారమా అనే విషయాలు కాసేపు పక్కనపెడితే.. వర్మ ట్రంప్ పై స్పందించిన విదంబెట్టిదనిన...
* అమెరికాకి డొనాల్డ్ ట్రంప్ గొప్ప అధ్యక్షుడవుతాడనికి నాకనిపిస్తోంది.
* మాజీ అధ్యక్షులైన రూజ్ వెల్ట్ - లింకన్ - జాన్ కెన్నెడీలు ఆయనతో పోలిస్తే ఎందుకూ పనికిరానివారని అనిపిస్తుంది.
* ట్రంప్ ని అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకోవడం ద్వారా అమెరికన్లు మొదటిసారి తెలివిగా ఆలోచిస్తున్నారు.
* నాకు తెలిసినంతవరకూ ట్రంప్ కేవలం అమెరికా సమస్యలే కాకుండా.. ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించేయగలడు.
ఈ రేంజ్ లో డొనాల్డ్ ట్రంప్ పై వర్మ ట్వీటారు!