ఎప్పుడేం అనిపిస్తే ట్వీట్ల రూపంలో పెట్టేస్తుంటారు వివాదస్పద దర్శకుడు వర్మ అని అంతా అనుకునేవారు. అయితే.. అలాంటిదేమీ లేదని.. ఆయనంతా వ్యూహం ప్రకారమే చేస్తుంటారన్న విషయం శ్రీరెడ్డి ఎపిసోడ్ తో స్పష్టమైంది. పవన్ మీద ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తే సంచలనం అవుతుందంటూ తాను శ్రీరెడ్డికి సూచన చేసినట్లుగా వర్మ తనకు తానే వీడియో మెసేజ్ లో ఒప్పుకొని తానెప్పుడూ పవన్ మీద కామెంట్లు చేయనంటూ ఒట్టు పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా తాను తన తల్లి మీద ఒట్టు వేశానని.. మాట తప్పనని చెప్పారు. ఆ మాట చెప్పిన మూడు.. నాలుగు రోజులకే తన మాటను పక్కన పెట్టేసి తనకు తోచినట్లుగా ట్వీట్లు పెట్టటం షురూ చేశారు వర్మ. ఇదిలా ఉంటే.. తాజాగా ఒక వీడియోను పెట్టి.. పవన్ పై ఊహించని రీతిలో ట్వీట్లు చేసి మరో వివాదానికి తెర తీశారు వర్మ.
వీడి చర్యలు అనూహ్యం వర్మ అంటూ ‘అజ్ఞాతవాసి’ డైలాగ్‌కు అతికినట్లుగా తన చర్యలతో పవన్ అభిమానులకు ఎక్కడో మండేలా పోస్టుల మీద పోస్టులు పెట్టారు. బోడి గుండుకు మోకాలిని లింకు పెట్టేసి.. పవన్ లోని ‘అజ్ఞాతవాసి’ అంటూ కొత్త తరహా వివాదానికి తెర తీశారు. వర్మ ట్వీట్లపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధం లేని రీతిలో ఇలా పోస్టులు పెట్టటం ఏమిటంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
ఇంతకీ వర్మ పెట్టిన ట్వీట్లు ఏమిటన్నది చూస్తే.. ఈ మధ్యన రవితేజ నటించిన నేల టిక్కెట్టు ఆడియో వేడుకకు పవన్ వెళ్లటం తెలిసిందే. ఈ సందర్బంగా రవితేజ వేసుకున్న టార్న్ జీన్స్ (అదేనండి జీన్స్ ప్యాంట్ కు మధ్య మధ్యలో రంధ్రాలు ఉంటాయే దాన్ని అలా పిలుస్తారు) పై పవన్ జోకులు వేశారు. కొత్త ట్రెండ్ ను ఫాలో అవుతూ మరీ కుర్రాడు అయిపోతున్నాడంటూ సరదా వ్యాఖ్యలు చేశారు.
కార్యక్రమం జరుగుతున్నప్పుడు రవితేజ ఫ్యాంటు మీద పవన్ చేతులు వేసి.. ఫ్యాంట్ చిల్లు దగ్గర పట్టుకున్నారు. దాన్ని ఎవరో కెమేరాతో షూట్ చేశారు. ఆ క్లిప్ ను పెడుతూ.. ‘అజ్ఞాతవాసి’లో ఈ కోణం మెగా ఫ్యామిలీతో పాటు.. జనసేన శ్రేణులకు కూడా తెలీదంటూ చేసిన ట్వీట్లు సంచలనంగా మారాయి. వర్మ ట్వీట్ల టేస్ట్ ను పలువురు తప్పుపడుతున్నారు. పవన్ ను కావాలనే టార్గెట్ చేసేలా వ్యవహరిస్తున్నారని.. దీనికి ఆయన తాజా ట్వీట్స్ నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.
వర్మ చేసిన ట్వీట్లను వివరంగా రాయటం కంటే కూడా.. ఆయనేం రాశారో దాన్ని యథాతధంగా రాయటం బెటర్. ఎందుకంటే.. అంత చౌకబారుగా ఎవరూ రాయలేరు మరి. వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన వర్మ ట్వీట్లపై పలువురు మండిపడుతున్నారు. తాజాగావర్మ చేసిన వ్యాఖ్యలు లక్ష్మణ రేఖను పూర్తిగా క్రాస్ చేసేసినట్లుగా ఉందన్న మాట బలంగా వినిపిస్తోంది.
పవన్ మీద వర్మ చేసిన ట్వీట్లను చూస్తే..
+ ‘అజ్ఞాతవాసి’ పవన్ కళ్యాణ్‌లో ఈ యాంగిల్ కూడా ఉన్నదని ఎక్స్‌ప్రెషన్‌ని బట్టి రవితేజ మొహంలో క్లియర్‌గా ‘టచ్ చేసి చూడు’ టైప్‌లో క్లియర్‌గా తెలుస్తుంది. కాని ఈ సీక్రెట్ మెగా ఫ్యామిలీకి జనసేన పార్టీకి తెలిసుండదు. బట్ పీకే గిల్లుడులో ‘నేల టిక్కెట్టు’ కనెక్షన్స్ కనిపిస్తున్నాయి.
+ పవన్ కళ్యాణ్ కాని.. రవితేజ తొడ మీద ఉన్న తన అత్యంత శ్రద్ధని జస్ట్ సగం రెండు రాష్ట్రాల మీద పెడితే అబ్బో.. అత్యంత సస్యశ్యామలం. రవితేజ ఎడమ తొడకి.. పవన్ కళ్యాణ్ కుడి చేతికి ఉన్న అవినాభావ సంబంధం ఆ దేవుడికే తెలియాలి’
+ రవితేజకి పవన్ కళ్యాణ్‌కి మధ్యలో ఉన్న ఈ తొడ సంబంధం గురించి లోగుట్టు జనసేన వాళ్లకే తెలియాలి. కానీ పీకేకి.. రవితేజ ఎడమ తొడ మీద చాలా మక్కువ ఉందన్న విషయం పీకే మొహంలో ఉన్న ఆనందంలో కనబడుతోంది’