దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'ఆర్ఆర్ఆర్'. రౌద్రం రుధిరం రణం.. సినిమా పేరని ఇటీవలే విడుదల చేసిన మోషన్ పోస్టర్ తో తెలిపారు. ఎన్టీఆర్, రాంచరణ్ లు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి మాములు సినిమాలనే అద్భుతంగా చెక్కుతాడు, అలాంటిది కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల సినిమా అంటే ఇక ఎంత అద్భుతంగా చెక్కుతున్నాడో అని అభిమానులు ఊహిచుకుంటున్నారు.
కానీ విడుదలైన మోషన్ పోస్టర్ చూస్తే మాత్రం.. ఖచ్చితంగా ఊహకందని రీతిలో ఉండబోతుందని ఎక్సపెక్ట్ చేయొచ్చు. అయితే విడుదలైన మోషన్ పోస్టర్ పై సెలెబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. గోపీచంద్ మలినేని, వరుణ్ తేజ్, అఖిల్, సుధీర్ బాబులతో పాటు ఆర్జీవి కూడా స్పందించాడు. ఇపుడు ఆర్జీవీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆయన ఏమని ట్వీట్ చేసాడంటే.. "కరోనా పట్టిపీడిస్తున్న ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో.. ఆర్ఆర్ఆర్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి మాకు భవిష్యత్తులో మంచి జరుగుతుందనే ఆశాభావాన్ని కలిగించావ్.. కోవిద్ లాంటి భయంకరమైనవి వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటి గొప్పవి కూడా వస్తాయి.." అంటూ ట్వీట్ చేసాడు. థ్యాంక్ యు రాజమౌళి అంటూ సెలవిచ్చాడు. ఆర్జీవీ చేసిన ట్వీట్ కి ఎంతో పాజిటివ్ గా స్పందిస్తున్నారు సినీ అభిమానులు.