ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. ప్రజలంతా కులమతభేదాలు వీడి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. గత సంవత్సరపు అనుభవాలను నెమరువేసుకుంటూనే నూతనోత్సాహంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని, అందరూ సంతోకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు. అయితే, ఈ రోజు `హ్యాపీ న్యూ ఈయర్ అని విషెస్ చెబితేనే హ్యాపీగా ఉంటారా? లేకపోతే ఉండరా? అనే ప్రశ్నలు ఓ వ్యక్తి మస్తిష్కాన్ని తొలచివేస్తున్నాయి. అంతేకాదండోయ్, ఈ రోజు విషెస్ చెబితేనే ఈ సంవత్సరమంతా బాగుంటుందని నమ్మేవారందరినీ....మూర్ఖులతో పోల్చేస్తున్నాడా `మేధావి`! ఇంతకీ ఆ అపర జ్ఞాని ఎవరో ఇప్పటికే మీకర్థమయ్యే ఉంటుంది. అవును, మీరనుకుంటున్నట్లు ఆ మహా మనిషి పేరు రామ్ గోపాల్ వర్మ!
వివాదాలు-వర్మ....భవిష్యత్తులో ఈ రెండింటినీ పర్యాయపదాలుగా ప్రకటించినా ఆశ్చర్యపోనవసరం లేదేమో. ఆ రెండు పదాలలోనూ కామన్ గా ఉండే అక్షరం `వ`.....అందుకే బహుశా వర్మ ఆలోచనలు కూడా అంతే విభిన్నంగా ఉంటాయేమో. వర్మకు అనిపిస్తే చాలు....ప్రధాని నుంచి అప్రాధాన్య విషయాల వరకు అన్నింటిపైనా సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించేస్తాడు. గతంలో వర్మ ....చాలామంది ప్రతి రోజూ ‘గుడ్ మార్నింగ్’ విషెస్ కోసం తమ విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవడమని షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, వర్మ ....న్యూ ఈయర్ విషెస్ చెప్పే వారిని ఉద్దేశించి తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. ‘‘హ్యాపీ న్యూ ఇయర్’ అని చెప్పడం ద్వారా ఒక వ్యక్తి జీవితం సంతోషమయం అవుతుందని నమ్మే మొద్దులకు ‘ఐ విష్ ఎ వెరీ అన్ హ్యాపీ న్యూ ఇయర్’. ఇతరుల సంతోషం, శ్రేయస్సు గురించి ప్రజలు నిజంగా ఆలోచించే వారే అయితే, వారు తమ డబ్బును, తమ విలువైన వస్తువులను దానం చేసేయాలి. కానీ, ఎవరూ ఆ పని చేయరు, శుభాకాంక్షలు మాత్రం చెబుతారు..ఎందుకంటే, వాటిని ఉచితంగా చెప్పొచ్చుగా’ అని వర్మ తనదైన శైలిలో ఘాటుగా విమర్శలు గుప్పించాడు.
అంతేకాదండోయ్, తన ఫిలాసఫీని ఫాలో అయ్యే వాళ్లకి మాత్రం వర్మ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి షాకిచ్చాడు. `` హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం వల్ల మిగతావారు సంతోషంగా ఉంటారు అని నమ్మని వారందరికీ హ్యాపీ న్యూ ఈయర్`` అంటూ వర్మ మరో పోస్ట్ చేశాడు. వర్మ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వర్మపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు వర్మకు మద్దతుగా పోస్టులు పెడితే....మరికొందరు వర్మ పైత్యానికి ఇది పరాకాష్ట అంటున్నారు. తనకు మద్దతిస్తున్న వారికి వర్మ న్యూ ఈయర్ విషెస్ చెప్పాడు కదా....ఆ రకంగా వర్మ కూడా మొద్దబ్బాయేనా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఆ విధమైన నమ్మకం లేని వారికి వర్మ విషెస్ చెప్పడం కరెక్టేనని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా, వర్మ తన మార్క్ కాంట్రవర్షియల్ కామెంట్లతో న్యూ ఈయర్ ను ప్రారంభించాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అదండీ సంగతి! అంతా న్యూ ఈయర్ హ్యాంగోవర్ లో ఉంటే వర్మ మాత్రం తనదైన `హ్యాంగోవర్` మార్క్ వ్యాఖ్యలు చేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఎంతైనా వర్మ వర్మే కదా!