వర్మ ఎన్నో ఫిలాసఫీలు చెప్తాడు. ఫాలోయర్లకు అవి సమ్మగా ఉంటాయి. 'సమ్మగా' అనే పద ప్రయోగం సభ్యత కాదు కానీ అంతకంటే ఆ భావాన్ని మరో పదంతో వ్యక్తీకరించడం మహా కష్టం. ఆయన చెప్పే లాజిక్కులు సైన్సు లాగా ఉంటాయి... అయన నోట వెంట వచ్చే రీజనింగ్ మైండ్ బ్లోయింగ్ అని ఫాలోయర్స్ అనుకుంటూ ఉంటారు. అయితే 'వర్మ నాస్తికుడా.. ఆస్తికుడా?' అనే ప్రశ్న వేస్తే మాత్రం వాళ్ళు కూడా సమాధానం తెలియక నోరెళ్ళబెట్టాల్సిందే.
ఆ విషయం వర్మకైనా తెలుసో లేదో పాపం! ఇప్పటికే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాను ప్రారంభించే ముందు తిరుమల శ్రీవారి ని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి మరీ సినిమా మొదలు పెట్టాడు. తన దైవం ఎన్టీఆర్ కు ప్రియమైన దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి కాబట్టి.. పెద్దాయన నమ్మకాన్ని గౌరవించి శ్రీవారిని దర్శించుకున్నాని ఆ సమయంలో శెలవిచ్చాడు. అంటే శ్రీవారిని నమ్మినట్టా.. నమ్మనట్టా?
ఇదిలా ఉంటే తాజాగా మరోసారి రామ్ గోపాల్ వర్మ శ్రీవారి దర్శనం చేసుకున్నాడు. ఆంధ్ర ప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి.. 150 మంది వైసీపీ ఎంఎల్ ఎ లతో కలిసి వెంకటేశ్వర స్వామీ దర్శనం చేసుకున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. "దర్శనం 2.0. #లక్ష్మీస్ ఎన్టీఆర్. వైయస్ జగన్ గారిని.. ఆయన ఆర్మీ 150 మంది ఎంఎల్ఎ లను లార్డ్ బాలాజీ గర్భగుడి లో చూడడం సంతోషంగా ఉంది. జగన్ గారు ఎప్పటికీ సీఎం గా ఉండాలని ప్రార్థించి ఉంటారు.. నేను 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాకు దీవెనల కోసం ప్రార్థించాను" అని ట్వీట్ చేశాడు. ఆర్టికల్ అయిపోయింది.. ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గో...విందా!