రజినీ ఎలా సూపర్ స్టారయ్యాడండీ బాబూ..

Update: 2016-04-17 10:11 GMT
రామ్ గోపాల్ వర్మ ఫోకస్ పవన్ కళ్యాణ్ మీది నుంచి రజినీకాంత్ పైకి షిఫ్టయింది. పవర్ స్టార్ ను వదిలేసి.. సూపర్ స్టార్ మీద పడ్డాడాయన. ఇలాంటి లుక్స్ తో అసలు రజినీకాంత్ సూపర్ స్టార్ ఎలా అయ్యాడబ్బా అంటూ తెగ ఆశ్చర్యపోతున్నాడు వర్మ. ఉన్నట్లుండి వర్మ రజినీకాంత్ గురించి మాట్లాడ్డానికి అమీ జాక్సన్ పెట్టిన ఫొటోనే కారణం. ‘రోబో-2’లో కథానాయికగా నటిస్తున్న అమీ.. షూటింగ్ స్పాట్లో మేకప్ లేకుండా ఒరిజినల్ గా ఉన్న రజినీతో కలిసి ఓ ఫొటో దిగి.. దాన్ని ట్విట్టర్లో పెట్టింది. అందులో రజినీ-అమీలను చూస్తే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లాగా ఉంది. ఆ ఫొటో చూసి వర్మ చాలా ఎగ్జైట్ అవుతూ వరుసగా ట్వీట్లు గుప్పించాడు.

స్టార్ డమ్ సంపాదించాలంటే మంచి లుక్స్ ఉండాలనే కాన్సెప్టునే రజినీ నాశనం చేశాడని.. రజినీని మించిన స్టార్ ఇంకెక్కడా ఉండడని అంటూ.. ‘‘సరైన లుక్స్ లేవు.. సిక్స్ ప్యాక్ లేదు. సరైన బాడీ లేదు. రెండు రెండున్నర డ్యాన్స్ మూమెంట్స్ మాత్రమే తెలుసు. ఇలాంటి ఏ మనిషీ సూపర్ స్టార్ కాలేడు. దేవుడికి ఇతనేం చేస్తే.. దేవుడు ఇతడికి ఇంత చేశాడో నాకు ఆశ్చర్యంగా ఉంది’’ అని వర్మ పేర్కొన్నాడు. జనాలు ఓ సినిమాను ఎందుకు ఇష్టపడతారో చెప్పలేం అనడానికి రజినీకాంత్ సరైన రుజువు అని వర్మ అభిప్రాయపడ్డాడు. ప్రపంచంలోని గొప్ప గొప్ప సైక్రియాట్రిస్టులు సైతం రజినీ కాంత్ ఫినామినాను వివరించలేక చతికలపడతారని వర్మ అన్నాడు. వర్మ ఏదైనా కొంచెం ఎగ్జాజరేట్ చేసి చెబుతాడు కానీ.. రజినీ విషయంలో ఆయన అభిప్రాయాలన్నింటితోనూ జనాలు సైతం ఏకీభవించాల్సిందే.
Tags:    

Similar News