''అప్పట్లో ఫైటర్లుగా ఉన్నప్పుడు గ్యాంగ్ లీడర్ - కొదమసింహం వంటి సినిమాల్లో పనిచేశాం. కాని ఫైట్ మాష్టర్లుగా మారాక.. ఆయనతో పనిచేసే అవకాశం రాలేదు. అందరి స్టార్ హీరోలతో పనిచేసిన మాకు.. అన్నయ్యతో మిస్సయిపోతాం అనే బాధ ఉండేది. ఇప్పుడది తీరిపోయింది'' అంటున్నారు ప్రముఖ ఫైట్ మాష్టర్లు రామ్-లక్ష్మణ్. ప్రస్తుతం వీరిరువురూ మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా అయిన ''ఖైదీ నెం 150'' సినిమా యాక్షన్ సీక్వెన్సుల షూటింగులో బిజీగా ఉన్నారు.
అసలు రామ్-లక్ష్మణ్ ఈ అవకాశం తమకు వస్తుందని ఊహించలేదట. ఈ 150 సినిమా అవకాశం మాకు ఇస్తారని అనుకోలేదు.. ఎందుకంటే ఎంతో ప్రెస్టీజియస్ సినిమా కాబట్టి.. ఇంకా ఎవరినైనా పిలుస్తారేమో అనుకున్నాం అని చెబుతున్నారు. ''గోవిందుడు అందరివాడేలే సినిమా చేసేటప్పుడు చరణ్ బాబు మాటిచ్చాడు.. ఆ మాట నిలబెట్టుకున్నాడు'' అంటూ ఈ సినిమా ప్రొడ్యూసర్ రామ్ చరణ్ ను పొగిడేశారు ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఫైట్ మాష్టర్లు. ఈ సినిమాకు కంపోజ్ చేస్తుంటే.. రోజూ మెగాస్టార్ అన్నయ్యను దగ్గర నుండి చూడటం ద్వారా ఆనందం ఉప్పొంగిపొర్లుతుందట.
''అన్నయ్య స్టయిల్ అండ్ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే మాకు కడుపు నిండిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఆయన అలా నడిచొస్తూ మధ్య మధ్యలో లుక్స్ ఇస్తుంటే మాకే చాలా కిక్ వచ్చేస్తోంది'' అంటున్నారు ఈ ఫైట్ కొరియోగ్రాఫర్లు. చాలా ఎమోషనల్ గా తమ ఆనందాన్ని అందరితో పంచుకున్నారు.