రొటీన్ డబ్బాతో రైటర్స్ కి ఫుల్లు పని

Update: 2015-11-12 11:30 GMT
ట్రెండ్ సృష్టిద్దామని కొన్ని ప్రయత్నాలు, తేడా వస్తే మళ్లీ ట్రెండ్ తగ్గట్టుగా మార్పులు, అవుట్ పుట్ అనుకున్నట్లు రాలేదని అనుమానాలు.. ఇలా రీజన్ ఏదైనా స్క్రిప్ట్ లో ఛేంజెస్ రైటర్స్ కి బోలెడు పని పెడుతున్నాయి. నాగార్జున చేస్తున్న సోగ్గాడే చిన్ని నాయన పరిస్థితి చూశాం. ఒకటికి రెండు సార్లు రీషూట్ చేసి... మొత్తానికి వచ్చే నెలలో అయినా జనాల మందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు నాగ్.

ఇప్పుడు హీరో రామ్ కూడా ఇలాంటి ఇబ్బందే పెడుతున్నాడు. వరుస ఫ్లాపుల తర్వాత పండగ చేస్కో హిట్ అవడంతో.. రొటీన్ మసాలా అంటూ శివమ్ పేరుతో చేసిన నాసిరకం ప్రయత్నాన్ని ప్రేక్షకులు తిప్పికొట్టారు. దీంతో ఈ కుర్రహీరోకి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే పండగ చేస్కో ఇచ్చిన జోష్ తో అదే టైప్ లాజిక్ లేని మసాలాలకు ప్రిపేర్ అయిపోయాడు. వీటిని అంతే సింపుల్ గా జనాలు రిజెక్ట్ చేస్తారని అర్ధమయ్యేసరికి.. చేస్తున్న సినిమాల్లో మార్పులు చేసుకోవాల్సి వస్తోంది.

ప్రస్తుతం హరికథ ఎలియాస్‌ 'నేను శైలజ' అనే మూవీ షూటింగ్ లో ఉన్నాడు రామ్. ఇప్పుడీ
సినిమాకి మార్పులు చేర్పులు చేస్తున్నారట. హరికథ పేరుతో ఏదో ఒక కథ చెబితే జనాలకు ఎక్కదనే సంగతి తెలుసుకుని, టైటిల్‌ తో పాటు స్క్రిప్ట్ లోనూ కీలక మార్పులు చేయిస్తున్నాడట. ఇప్పటికే ఫిలిం నగర్‌ కు చెందిన నలుగురు పెద్ద రైటర్లు కూర్చొని సినిమాను నానా రకాల యాంగిల్సులో కత్తెరించి మరీ వండుతున్నారని టాక్‌ నడుస్తోంది. ఇన్ని కత్తెర్లు - అతుకులు పడితే.. ఆ అవుట్‌ పుట్ ఎలా ఉంటుందో మరి? ఏదేమైనా రొటీన్‌ కథలతో సినిమాలు చేసే హీరోలు.. ఇప్పుడు రచయితలకు చేతినిండా పని కలిపిస్తున్నారు. కాకపోతే ఈ రైటర్లు ఏదైనా కొత్తగా ట్రై చేస్తే ఒట్టు.
Tags:    

Similar News