తెలంగాణ‌-ఆంధ్రా అని విభ‌జించొద్దు

Update: 2019-07-17 12:19 GMT
సినిమాని ప్రాంతీయ‌త కోణంలో చూస్తారా?  హీరో వేషం.. యాస‌-భాష .. సంస్కృతి వీట‌న్నిటిని దృష్టిలో పెట్టుకుని థియేట‌ర్ల‌కు వ‌స్తారా? అంటే అలాంటిదేమీ లేద‌ని అన్నారు ఎన‌ర్జిటిక్ రామ్. అత‌డు న‌టించిన ఇస్మార్ట్ శంక‌ర్ రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న రామ్ కి ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైతే అందుకు అత‌డు స్పందించిన తీరు ఆస‌క్తిని క‌లిగించింది.

ఇస్మార్ట్ శంక‌ర్ నైజాం యాస ఆంధ్రా వాళ్ల‌కు న‌చ్చుతుందా? అన్న ప్ర‌శ్న‌కు .. ఇది తెలంగాణ యాస‌.. ఇది ఆంధ్రా భాష అంటూ జ‌నం సినిమాలు చూడ‌రు. అందులో క‌థ కంటెంట్ యంగేజ్ చేస్తే చూసేస్తారు అని అన్నారు. అయినా సినిమాల్ని ఇది తెలంగాణ‌.. ఇది ఆంధ్రా అన్న కోణంలో విభ‌జించి చూడొద్దు అని రామ్ ఈ సంద‌ర్భంగా కోరారు. సినిమా న‌చ్చితేనే జ‌నాలు చూస్తారు. ఇటీవ‌లి కాలంలో తెలంగాణ‌లో ఆడిన ఆంధ్రా బ్రాండ్ సినిమాల్ని ఇక్క‌డా ఆద‌రించార‌ని రామ్ అన్నారు. నైజాం యాస అర్థం కానంత‌గా ఏదీ సినిమాలో ఉండ‌ద‌ని రామ్ తెలిపారు. ఓ బేబిలో స‌మంత ఆంధ్రా యాస‌లో మాట్లాడితే.. ఫిదాలో సాయి ప‌ల్ల‌వి పూర్తిగా తెలంగాణ యాస‌లోనే మాట్లాడింది. ఆ రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించాయి క‌దా? అన్న ఎగ్జాంపుల్ ప్ర‌స్థావ‌న‌కు వ‌చ్చింది.  

ఇస్మార్ట్ శంక‌ర్ కొరియ‌న్ సినిమా కాపీ క‌దా? అన్న ప్ర‌శ్న‌కు.. అందులో వాస్త‌వం లేద‌ని రామ్ ఖండించారు. త‌ల వెన‌క మెమ‌రీ చిప్.. సిమ్ కార్డ్ అన్న పాయింట్ త‌ప్ప క‌థ కాపీ అని చెప్ప‌లేర‌ని అన్నారు. మాస్ ఇస్ట‌యిల్ ఇస్మార్ట్ శంక‌ర్ విజ‌యంపై ధీమాని క‌న‌బ‌రిచారు. మొత్తానికి ఇస్మార్ట్ శంక‌ర్ రామ్ కెరీర్ ని కీల‌క మ‌లుపు తిప్పే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంటుందా? అన్న ఆస‌క్తి సినీవ‌ర్గాల్లో నెల‌కొంది. మ‌రో 12 గంట‌ల త‌ర్వాత ఇస్మార్ట్ శంక‌ర్ రిపోర్ట్ ఏమిటి అన్న‌ది రివీల్ కానుంది.


Tags:    

Similar News