ఎనర్జిటిక్‌ 'దేవదాస్‌' కు 15 ఏళ్లు

Update: 2021-01-11 04:43 GMT
టాలీవుడ్ ఎనర్జిటిక్‌ స్టార్ రామ్‌ హీరోగా 'దేవదాస్‌' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే వైవీఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా యూత్‌ ఆడియన్స్ కు విపరీతంగా నచ్చేసింది. మొదటి సినిమాతోనే రామ్‌ పోతినేనికి అభిమానులు భారీగా అయ్యారు. రామ్‌ సినిమా లో ఎనర్జీ ఉంటుందని ఆయన ఏ సినిమా చేసినా కూడా మాస్‌ ఆడియన్స్‌ ను ఎంటర్‌ టైన్‌ మెంట్‌ చేసే ఎలిమెంట్స్ ఉంటాయని అతి తక్కువ సమయంలోనే అభిమానులతో ప్రేక్షకులతో అనిపించుకున్నాడు. రామ్‌ మొదటి సినిమా దేవదాస్‌ విడుదల అయ్యి నేటికి 15 ఏళ్లు పూర్తి అయ్యింది.

2006 సంక్రాంతి కానుకగా వచ్చిన దేవదాస్ సినిమాను మొదట జనాలు పట్టించుకోలేదు. కాని ఎప్పుడైతే విడుదలైన తర్వాత టాక్‌ దక్కించుకుందో అద్బుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి. అప్పట్లో కొత్త హీరో ఆ స్థాయిలో వసూళ్ల రాబట్టడం అదే ప్రథమంగా రికార్డు దక్కించుకుంది. అద్బుతమైన రికార్డును నమోదు చేసిన దేవదాస్‌ తర్వాత రామ్‌ సినిమాల ఎంపిక విషయంలో ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటూ వచ్చాడు. మద్యలో ఒకటి రెండు కాస్త అటు ఇటు అయినా కూడా మొత్తానికి రామ్‌ ఈ 15 ఏళ్ల సినీ కెరీర్‌ లో ఎంతో మందిని అలరించాడు. 15 ఏళ్ల క్రితం దేవదాస్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ఇస్మార్ట్‌ రామ్‌ మళ్లీ ఈ సంక్రాంతికి రెడ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.
Tags:    

Similar News