రియ‌లైజ్ అయి రెండ‌వ భాగంలోకి వ‌చ్చిందా?

ప్ర‌స్తుతం టీమ్ అంతా ఆ సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది.

Update: 2024-10-28 14:30 GMT

'భూల్ భూల‌య్య' ప్రాంచైజీ ఎంత పెద్ద స‌క్సెస్ సాధిచిందో తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన రెండు భాగాలు భారీ విజ‌యం సాధించాయి. ఎలాంటి అంచ‌నాలు లేకుండానే రిలీజ్ అయిన సినిమా అనూహ్య‌మైన ఫ‌లితాలు సాధించిం ది. తాజాగా 'భూల్ భుల‌య్య‌-3' కూడా రిలీజ్ కి రెడీగా ఉంది. ప్ర‌స్తుతం టీమ్ అంతా ఆ సినిమా ప్ర‌మోష‌న్ లో బిజీగా ఉంది. ఇటీవల మాధురీ దీక్షిత్ -విద్యాబాలన్ నటించిన పాటను కూడా రిలీజ్ చేసారు.

పాట‌కు మంచి రెస్పాన్స వ‌స్తోంది. అయితే భూల్ భుల‌య్య మొద‌టి భాగంలో విద్యా బాల‌న్ న‌టించింది. కానీ ఆ తర్వాత రెండ‌వ భాగంలో అమ్మ‌డు క‌నిపించ‌లేదు. మ‌ళ్లీ మూడ‌వ భాగంలో యాడ్ అయింది. మ‌రి రెండ‌వ భాగంలో విద్యా బాల‌న్ ఎందుకు మిస్ అయిన‌ట్లు? అంటే ఓ ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట ప‌డింది. ప్ర‌చారంలో భాగంగా నిర్మాత భూష‌ణ్ కుమార్ ఆ గుట్టు విప్పారు. 'విద్యాబాలన్ రెండో విడతలో భాగం కావడం ఇష్టం లేదు.

అందుకే 'భూల్ భూలయ్య 2'ని తిర‌స్క‌రించారన్నారు. మొదటి భాగం ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లుగానే రెండవ భాగం కూడా విజయం సాధిస్తుందా? లేదా? అనే సందేహంతో విద్యాబాలన్ ఆ పాత్రను తిరస్కరించినట్లు తెలు స్తోంది. మ‌రి మూడ‌వ భాగంలో ఎలా యాడ్ అయిందంటే? రెండ‌వ భాగం స‌క్సెస్ అవ్వ‌డంతో విద్యాబాల‌న్ సందే హాల‌ను ప‌క్క‌న‌బెట్టి రియ‌లైజ్ అయిన‌ట్లు తెలుస్తోంది.

అందుకే ప్రాజెక్ట్ ప్రారంభం కాక‌ముందే అమ్మ‌డి వైపు నుంచి పాజిటివ్ సిగ్నెల్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. మేక‌ర్స్ అడ‌గ‌క ముందే మూడ‌వ భాగంలో న‌టిస్తాన‌ని హామీ ఇచ్చిందిట‌. ఇచ్చిన మాట ప్ర‌కారం మూడ‌వ భాగంలో యాడ్ అయింది. అయితే స్టార్ డ‌మ్ కాపాడుకునే విష‌యంలో పేరున్న న‌టులు ఆమాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం స‌హ‌జం. ఇండ‌స్ట్రీలో పారితోషికం కంటే ఉన్న స్టార్ డ‌మ్ ని కాపాడుకోవ‌డం అన్న‌ది ఏ న‌టికైనా ఎంతో ముఖ్య‌మైన‌దే.

Tags:    

Similar News