S.K పాత్రల ఎంపిక వెనక లాజిక్ అదేనా..?

కోలీవుడ్ లో తన మార్క్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు శివ కార్తికేయన్.

Update: 2024-10-28 12:30 GMT

కోలీవుడ్ లో తన మార్క్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు శివ కార్తికేయన్. లేటెస్ట్ గా అమరన్ అంటూ తన కొత్త సినిమాతో వస్తున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో కమల్ హాసన్ నిర్మించారు. సినిమాను మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కించారు. ఆర్మీ ఆఫీసర్ గా శివ కార్తికేయన్ వెరైటీ గెటప్ లతో ఆకట్టుకున్నారు.

కల్పిత కథలో ప్రధాన పాత్రలుగా చేయడం ఈజీనే కానీ నిజ జీవిత కథలో పాత్రలను పోలినట్టుగా నటించడం అనేది చాలా కష్టం. ఇంతకుముందు ఇలా స్పూర్తి దాయకమైన వ్యక్తుల జీవిత కథలతో చాలా సినిమాలు వచ్చాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథతో తెరకెక్కిన అమరన్ ఉంటుంది. అక్టోబర్ 31న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ తో పాటు ప్రచార చిత్రాలన్నీ ప్రేక్షకులను అలరించాయి.

అమరన్ సినిమాలో సాయి పల్లవి ఫిమేల్ లీడ్ గా నటించింది. ఆమె మేజర్ ముకుంద్ వరదరాజన్ వైఫ్ ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించారు. ఐతే ఈ సినిమా ప్రమోషన్స్ లో శివ కార్తికేయన్ తనకు కూడా ఐ.పి.ఎస్ అవ్వాలని ఉండేదని కానీ సినిమాల మీద ఆసక్తితో ఇటు వచ్చానని అన్నారు. తన ఫాదర్ పోలీస్ ఆఫీసర్ అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి ఆ యూనిఫాం మీద ఒక గౌరవం ఉందని అన్నాడు. అందుకే తాను చేస్తున్న సినిమాల్లో డాక్టర్, పోలీస్ ఇలా స్పూర్తి నింపే పాత్రలు చేస్తున్నానని అన్నారు శివ కార్తికేయన్.

అమరన్ సినిమా ప్రచార చిత్రాలు చూస్తే కార్తి ఆ పాత్రకు తానెంత కష్టపడ్డాడు అన్నది అర్ధమవుతుంది. ఎంచుకున్న పాత్ర కోసం అంత కష్టపడుతున్నాడు కాబట్టే శివ కార్తికేయన్ హీరోగా నిలదొక్కుకోగలిగాడు. తెలుగు ఆడియన్స్ కు శివ కార్తికేయన్ దగ్గర అవ్వాలని చూస్తున్నాడు. అందుకే అతని ప్రతి సినిమా ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు సినిమా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ కి కూడా వస్తున్నాడు.

జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కెవితో శివ కార్తికేయన్ ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. ఛాన్స్ వస్తే డైరెక్ట్ తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అంటున్నాడు శివ కార్తికేయన్. ప్రిన్స్ తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నం ఇప్పటివరకు అయితే జరగలేదని చెప్పొచ్చు. కొత్త కొత్త కథలతో కెరీర్ ని స్ట్రాంగ్ చేసుకుంటున్న శివ కార్తికేయన్ అమరన్ సినిమాను మాత్రం స్పెషల్ ఇంట్రెస్ట్ తో చేసినట్టు తెలుస్తుంది. అమరన్ తెలుగు రిలీజ్ ఈవెంట్ లో కూడా ఇలాంటి సినిమాలను ఆదరిస్తేనే ఇలాంటి ఇంకా గొప్ప సినిమాలు మీకు అందించే ఛాన్స్ ఉంటుందని చెప్పాడు.

Tags:    

Similar News