న‌టాషా స్టాంకోవిక్ పూల్ సైడ్ ట్రీట్

ఇప్పుడు న‌టాషా పూల్ సైడ్ ట్రీట్ వైర‌ల్ గా మారుతోంది. ఈ భామ బ్లాక్ స్విమ్ సూట్ ధ‌రించి త‌టాకంలో ఈత కొడుతూ క‌నిపించింది.;

Update: 2025-03-11 02:30 GMT

హార్థిక్ పాండ్యా నుంచి విడిపోయిన నటాషా స్టాంకోవిక్ తన ఫిట్‌నెస్‌ను సీరియస్‌గా తీసుకుంటుంది. జిమ్ కి వెళ్లి తన వ్యాయామ దినచర్యలను ఎప్పుడూ మిస్ చేయదు. ఇటీవ‌ల వ‌రుస‌గా త‌న‌ వ్యాయామ వీడియోలను నిరంతరం షేర్ చేస్తూనే ఉంది. ఈ వీడియోలు వేలాదిగా అభిమానులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఆస‌క్తిక‌రంగా న‌టాషాతో పాటు వ్యాయామ దిన‌చ‌ర్య కొలీగ్ కం స్నేహితుడు, సన్నిహితుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇలిక్ కూడా ఆమెతో క‌లిసి జిమ్ చేసిన‌ ఫోటోలు గ‌తంలో వైర‌ల్ అయ్యాయి.

 

ఇన్‌స్టాలో అలెగ్జాండర్‌తో కలిసి ఏరోబిక్ స్టెప్పర్‌పై కార్డియో వ్యాయామాలు చేస్తున్న వీడియోను ఇంత‌కుముందు పోస్ట్ చేసింది. ఇటీవల న‌టాషా తన 33వ పుట్టినరోజును ముంబైలోని ఒక పోష్ రెస్టారెంట్‌లో గ్రాండ్‌గా జరుపుకుంది. ఈ సందర్భంగా బ్యాక్‌లెస్ దుస్తుల్లో న‌టాషా ఇచ్చిన ఫోజులు కుర్ర‌కారును ఆక‌ర్షించింది. కుమారుడు అగస్త్య హెచ్.పాండ్యాతో కలిసి తన 33వ పుట్టినరోజు వేడుక నుండి వీడియోలను షేర్ చేసింది.

 

ఇప్పుడు న‌టాషా పూల్ సైడ్ ట్రీట్ వైర‌ల్ గా మారుతోంది. ఈ భామ బ్లాక్ స్విమ్ సూట్ ధ‌రించి త‌టాకంలో ఈత కొడుతూ క‌నిపించింది. న‌టాషా స్వేచ్ఛా జీవ‌నాన్ని ఇది ఆవిష్క‌రిస్తోంది. ఈ భామ మునుప‌టి బంధ‌నాల‌ను ఛేధించి స్వేచ్ఛ‌ను ఆస్వాధిస్తోందని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

2020లో టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యాను వివాహం చేసుకున్న న‌టాషా గత ఏడాది విడాకుల‌ను ప్ర‌క‌టించింది. ప్రస్తుతం నటాషా ఒంట‌రి. న‌టాషా- హార్థిక్ త‌మ కుమారుడికి స‌హ‌త‌ల్లిదండ్రులుగా కొన‌సాగుతున్నారు.

నటాషా ఫుక్రీ రిటర్న్స్, డాడీ, జీరో, ఝూతా కహిన్ కా, యారం, ది బాడీ చిత్రాలలో ప్రత్యేక పాత్రలు పోషించింది. ఆమె సల్మాన్ ఖాన్ వివాదాస్పద రియాలిటీ షో `బిగ్ బాస్ 8`, డ్యాన్సింగ్ రియాలిటీ షో `నాచ్ బలియే 9`లలో కూడా భాగం. గాయకుడు ప్రీతీందర్‌తో కలిసి `తేరే కర్కే` పాటలో ఇటీవ‌ల కనిపించింది. ఈ ట్రాక్ గత సంవత్సరం అక్టోబర్‌లో విడుదలైంది.

Tags:    

Similar News