అప్పుడే సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న రామ్

Update: 2022-03-04 02:30 GMT
హీరో ఉస్తాద్ రామ్ కెరీర్‌ `ఇస్మార్ట్ శంక‌ర్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ తో ఒక్క‌సారిగా మారిపోయింది. అప్ప‌టి వ‌ర‌కు ల‌వ‌ర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈ హీరో ఈ మూవీ త‌రువాత ఉస్తాద్ రామ్‌గా మారిపోయారు. మ‌ధ్య‌లో కిషోర్ తిరుమ‌ల‌తో చేసిన రీమేక్ మూవీ `రెడ్‌` కాస్త స్పీడ్ బ్రేక‌ర్ గా మారినా ప్ర‌స్తుతం చేస్తున్న `ది వారియ‌ర్` రామ్ కెరీర్ ని మ‌రో మ‌లుపు తిప్పేలా క‌నిపిస్తోంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి త‌మిళ ద‌ర్శ‌కుడు ఎన్ . లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

రామ్ డిఫ‌రెంట్ మేకోవ‌ర్ తో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నారు. కృతిశెట్టి, అక్ష‌ర గౌడ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. స‌రికొత్త నేప‌థ్యంలో ప‌వ‌ర్ ఫుల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీ లో గురుగా పవ‌ర్ ఫుల్ విల‌న్ గా హీరో ఆది క‌నిపించ‌బోతున్నారు.

ఇటీవ‌ల విడుద‌ల చేసిన ఫ‌స్ట్ లుక్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. వైర‌మ్ ధ‌నుష్ గా `స‌రైనోడు` చిత్రంలో విల‌క్ష‌ణమైన విల‌నిజాన్ని ప‌లికించిన ఆది పినిశెట్టి `ది వారియ‌ర్‌`లోనూ త‌న‌దైన మార్కు విల‌నిజంతో ప్రేక్ష‌కుల్ని స‌ర్ ప్రైజ్ చేయ‌నున్నాడ‌ట‌.

ఇదిలా వుంటే చిత్రీక‌ర‌ణ ద‌శ‌లోనే హాట్ టాపిక్ గా మారిన ఈ మూవీ తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లో నిలుస్తోంది. ఈ మూవీ డిజిట‌ల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడు పోయిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.

ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ ఈ మూవీ డిజిట‌ల్ అండ్ శాటిలైట్ రైట్స్ భారీ ఆఫ‌ర్ ని అందించింద‌ని, రెండు విభాగాల హ‌క్కుల కోసం ఈ సంస్థ ఏకంగా `ది వారియ‌ర్‌` మేక‌ర్ కి 35 కోట్లు చెల్లించింద‌ని తెలుస్తోంది. అయితే ఈ వార్త‌ల‌పై మేక‌ర్స్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.  

ఈ వార్త ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ స్పందించాల్సిందే అని చిత్ర వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ఇదే నిజ‌మైతే రామ్ చిత్రాల్లో ఇదే భారీ ఆఫ‌ర్ గా చెబుతున్నారు. న‌దియా, బ్ర‌హ్మాజీ `క్రాక్‌` ఫేమ్ చిరాగ్ జైన్‌, రెడిన్ కింగ్స్ లే కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం దేవిశ్రీ‌ప్ర‌సాద్‌, ఫైట్స్ అన్బు - అరివు, ఛాయాగ్ర‌హ‌ణం సుజీత్ వాసుదేవ్‌, మాట‌లు సాయి మాధ‌వ్ బుర్రా, లింగుస్వామి, ఎడిటింగ్ న‌వీన్ నూలి, నిర్మాత శ్రీ‌నివాస చిట్టూరి.
Tags:    

Similar News