ఇప్పుడు ఏ సినిమాకైనా సరే.. ఆడియో రిలీజ్ ఈవెంటే అతి పెద్ద ఫంక్షన్. సక్సెస్ తర్వాత పెద్ద పెద్ద ఫంక్షన్లు ఏర్పాటు చేసే కల్చర్ పోవడంతో.. ఆడియో రిలీజ్ నే శతదినోత్సవ పండగ రేంజులో జరిపేస్తున్నారు. అలాంటి ఈవెంట్ కు ఫ్యాన్స్ ని రావద్దంటూ ఎనర్జిటిక్ హీరో రామ్ కోరుతున్నాడు.
ప్రస్తుతం హైద్రాబాద్ లో భారీ వర్షాల కారణంగా.. పరిస్థితులు చేజారిపోతోన్న సంగతి చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ సిట్యుయేషన్ లో.. హైద్రాబాద్ వచ్చేసి తన సినిమా హైపర్ ఆడియోకి అటెండ్ కావాల్సిన అవసరం లేదని.. చక్కగా ఇంటి దగ్గరే టీవీ పెట్టుకుని.. లైవ్ లో చూసి ఎంజాయ్ చూసి ఎంజాయ్ చేయాలని పిలుపునిచ్చాడు రామ్. హైద్రాబాద్ అంతా ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో.. చేసేది లేక అధికారులు మ్యాన్ హోల్స్ మూతలు తెరిచి నీటిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
ఇలాంటి పరిస్థితిలో వేడుకల కోసం వచ్చి.. ప్రమాదాలకు గురి కావద్దంటూ.. హీరో రామ్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంది. ఫ్యాన్స్ పట్ల హీరోలు ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో చెప్పేందుకు ఇదో సంఘటన అని చెప్పుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు.