ర‌ష్యాపై తూటా పేల్చిన చ‌ర‌ణ్ అసిస్టెంట్ ఫాద‌ర్!

Update: 2022-03-15 13:30 GMT
ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య నెల‌కొన్న యుద్ద వాతావ‌ర‌ణం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఉక్రెయిన్ ద‌య‌నీయ ప‌రిస్థితి చూసి అంతా  చ‌లించిపోతున్నారు. అంత‌టి దారుణ‌మైన ఊచ‌కోత‌కు ర‌ష్యా తెగ‌బ‌డింది. అయినా రొమ్ము విడిచి ఉక్రెయిన్ ద‌ళాలు పోరాటం చేస్తున్నాయి. ఉక్రెయిన్ కోసం సామాన్య పౌరులు సైతం గ‌న్ ప‌ట్టుకుని యుద్దంలోకి దిగారు. దేశ అధ్య‌క్షుడి పిలుపు మేర‌కు ప్ర‌తీ ఒక్క‌రు ఇప్పుడు ర‌ష్యాతో పోరాడుతున్నారు. ర‌ష్యా తుటాల్ని చిల్చీకుంటూ ముందుకు సాగుతున్నారు.

అలాంటి ఉక్రెయిన్ టాపిక్ ఇప్పుడు `ఆర్ ఆర్ ఆర్` టీమ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా లో కీల‌క స‌న్నివేశాలు కొన్నింటిని ఉక్రెయిన్ లో చిత్రీక‌రించిన సంగ‌తి  తెలిసిందే. వాటిలో  తారక్..రామ్ చ‌ర‌ణ్ స‌హా కీల‌క‌ స‌భ్యులంతా పాల్గొన్నారు. ఇక్క‌డ షూటింగ్ జ‌రుగుతున్నంత కాలం ఉక్రెయిన్ వాసుల స‌హకారం సైతం `ఆర్ ఆర్ ఆర్` టీమ్ పొందింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రీక‌ర‌ణ ముగించుకుని రాగానే ఉక్రియెన్ -ర‌ష్యా మ‌ధ్య యుద్దం మొద‌లైంది.

తాజాగా `ఆర్ ఆర్ ఆర్` ప్ర‌మోష‌న్ లో భాగంగా అప్పటి అనుభ‌వాల్ని రాజ‌మౌళి ..రామ్ చ‌ర‌ణ్ గుర్తు చేసుకున్నారు. `ఆర్ ఆర్ ఆర్ `షూటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడు అక్క‌డి రాజ‌కీయ ప‌రిస్థితులు గురించి అస్స‌లు తెలియ‌దు. అక్క‌డ ఇంత‌టి దారుణ‌మైన యుద్ద వాతావ‌ర‌ణం ఉంద‌ని ఇండియాకి వ‌చ్చిన త‌ర్వాతే తెలిసింది. చాలా మంది స్నేహితులు ఉక్రెయిన్ లో ఎలా షూటింగ్ చేసార‌ని ఇప్పుడు అడుగుతున్నారు. అయితే అక్క‌డ షూట్ ఉన్నంత కాలం ఎలాంటి ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌వ్వ‌లేదు.

అంతా స‌వ్యంగా..సంతోషంగానే సాగింది. తార‌క్..చ‌ర‌ణ్ అక్క‌డి ప్ర‌జ‌ల‌తో బాగా మాట్లాడేవారు. నేను కూడా నా  డ్రైవ‌ర్ ..అసిస్టెంట్ క‌లిసి మాట్లాడేవాడిని. యుద్దం మొద‌లైన త‌ర్వాత వాళ్లకి ఫోన్ చేసి ప‌రిస్థితులు అడిగి  తెలుసుకున్నా. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు తొల‌గిపోవాల‌ని..అంతా నార్మ‌ల్ అవ్వాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

ఇక చ‌ర‌ణ్ ఏమ‌న్నారంటే? ఉక్రెయిన్ షూటింగ్ మంచి అనుభూతినిచ్చింది. యుద్ద మేఘాలు క‌మ్ముకున్న చోట మేము షూటింగ్ చేసామంటే ఇప్ప‌టికీ న‌మ్మ‌లేక‌పోతున్నా. అలాంటి ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఏమాత్రం ఐడియా లేదు. అక్క‌డి ప్ర‌జ‌లు మ్మ‌ల్ని ఎంతో అభిమానించారు.

నా సెక్యురిటీ టీమ్ తో మాట్లాడా. కొంత డ‌బ్బు కూడా పంపించా. 80 ఏళ్ల వాళ్ల నాన్న కూడా గ‌న్ ప‌ట్టుకోవ‌డం చాలా బాధ‌గా అనిపించింది. అక్క‌డ మ‌ళ్లీ వీలైనంత త్వ‌రంగా శాంతి ప‌రిస్థితులు నెల‌కొనాల‌ని కోరుకుంటున్నా`` అని అన్నారు. గ‌తంలో రాజ‌మౌళి `బాహుబ‌లి` షూటింగ్ లో కొన్ని స‌న్నివేశాలు సైతం ఉక్రెయిన్ లో షూట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే `సైరా న‌ర‌సింహారెడ్డి` తోపాటు  ప‌లు చిత్రాలు ఉక్రెయిన్ లో షూటింగ్ జ‌రుపుకున్నాయి. ఉక్రెయిన్ భార‌తీయ సినిమాల‌కు అడ్డా లాంటింది.
Tags:    

Similar News