VD 12: చరణ్ అందుకే చేయలేదన్నమాట!

Update: 2023-01-15 04:30 GMT
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ జరుగుతూ ఉన్న సమయంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఈ సినిమాని నిర్మించడానికి కూడా రెడీ అయ్యింది. ఇక రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ లో ఉండటంతో గౌతమ్ తిన్ననూరి హిందీలో జెర్సీ రీమేక్ చేశారు. అయితే తెలుగులో జెర్సీకి వచ్చిన రెస్పాన్స్ హిందీలో రాలేదు. అక్కడ డిజాస్టర్ అయ్యింది.

ఇక ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకోవడంతో చరణ్ కి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ వచ్చింది. ఇక గౌతమ్ తో అనుకున్న సినిమాని సెట్స్ పైకి రామ్ చరణ్ నెక్స్ట్ తీసుకొని వెళ్తాడని అనుకున్నారు. అయితే ఊహించని విధంగా ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. అయితే రామ్ చరణ్ ఈ కథని ఎందుకు రిజక్ట్ చేసాడు అనేది ఎవరికీ తెలియలేదు. ఇక తాజాగా అదే కథతో గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండతో సినిమాని ఎనౌన్స్ చేశాడు.

ఇక ఈ మూవీని పాన్ ఇండియా లెవల్ లోని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటి అనేది పోస్టర్ తో రివీల్ చేశారు. పోస్టర్ లో షాడోలో ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు. దీనిని బట్టి ఇది పవర్ ఫుల్ కాప్ స్టొరీ అని అర్ధం అవుతుంది. ఈ నేపధ్యంలో చరణ్ ఈ మూవీ రిజక్ట్ చేయడానికి కారణం కూడా ఇదే అయ్యుంటుంది అనే మాట వినిపిస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలోనే కనిపించాడు. ఆ క్యారెక్టర్ ని మంచి ప్రశంసలు లభించాయి.

ఓ విధంగా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ లో మెయిన్ స్టొరీ లైన్ రామ్ చరణ్ క్యారెక్టర్ బేస్ చేసుకొని ఉంటుంది. ఇక ఇంటర్నేషనల్ లెవల్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ భాగా రీచ్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ తర్వాత వెంటనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో అంటే కచ్చితంగా ఆర్ఆర్ఆర్ లో క్యారెక్టర్ లో ఆడియన్స్ పోల్చి చూస్తారు. ఏ మాత్రం మిస్ ఫైర్ అయినా కూడా మొదటికే ఇబ్బంది అవుతుందని గ్రహించి రామ్ చరణ్ ఈ మూవీ రిజక్ట్ చేసి ఉంటాడనే మాట వినిపిస్తుంది.
Tags:    

Similar News