దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ చిత్రాల్లో హీరోల స్టన్నింగ్ లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్ర్కిప్ట్..పాత్రని బట్టి హీరోని ఏ రేంజ్ లో ఎలివేట్ చేయాలో అలా పక్కాగా ప్లాన్ చేసి మార్కెట్ లోకి వదులుతారాయన.
హీరోలుక్ డిజైన్ విషయంలో శంకర్ చాలా పకడ్భందీగా ఉంటారు. హీరో లుక్ పై శంకర్ మార్క్ వేరియేషన్ కనిపిస్తుంది. మేక్ ఓవర్ పరంగా శంకర్ కమిట్ మెంట్..డెడికేషన్ పీక్స్ లో ఉంటుంది. ఇప్పుడా అరుదైన ఛాన్స్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి దక్కిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చరణ్ తన 15వ చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ ప్రకటనతోనే అంచనాలు ఆకాశాన్నంటడం మొదలైంది. మధ్యలో కొంచెం డిస్టబెన్స్ ఏర్పడినప్పటికీ మళ్లీ ఈ ద్వయం ట్రాక్ లో కి వచ్చేసింది. ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది.
దీంతో శంకర్ చరణ్ లుక్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. మార్చి 27న చరణ్ పుట్టిన రోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ అభిమానులకు శంకర్ బిగ్ ట్రీట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. బర్డ్ డే సందర్భంగా చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆరోజున రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారుట.
చరణ్ ని ఈ లుక్ లో చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారుట. చరణ్ గత సినిమాలన్నింటికంటే చాలా కొత్తగా స్టైలిష్ గా అతని రోల్ ని ఎలివేట్ చేసేలా లుక్ డిజన్ ఉంటుందని అంటున్నారు. ఇందులో శంకర్ మార్క్ చరణ్ కనిపిస్తాడని టీమ్ ధీమాగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం శంకర్ డిజైనింగ్ టీమ్ చరణ్ లుక్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.
అందుకోసం విదశృ బృందాన్నే దించినట్లు మరోవైపు టాక్. శంకర్ సినిమాకు ఎక్కువగా విదేశీ టెక్నీషియన్లు పనిచేస్తుంటారు. క్రియేటివ్ పరంగానూ వాళ్ల భాగస్వామ్యం కీరోల్ పోషిస్తుంది. స్థానిక ప్రతిభను ప్రోత్సహిస్తూనే విదేశీ నిపుణలకు ప్రాముఖ్యతనివ్వడం శంకర్ స్పెషాల్టీ.
ముఖ్యంగా ఇలాంటి డిజైన్స్ విషయంలో టాప్ టెక్నిషీయన్ల ఐడియాలజీని వాడుకోవడంలో శంకర్ ప్రత్యేకత వేరు. మరి చరణ్ లుక్ విషయంలో అలాంటి వారికి అవకాశం కల్పించారా? లేక పూర్తిగా శంకర్ ఐడియాలజీనే వర్కౌట్ చేస్తున్నారా? అన్నది చూడాలి. ఈ సినిమా సక్సెస్ శంకర్ కి చాలా కీలకం. కొన్ని చిత్రాలతో కోలీవుడ్ లో శంకర్ బ్రాండ్ ఇమేజ్ పై ఓ మచ్చ ఏర్పడింది.
ఆ కారణంగా కోలీవుడ్ స్టార్స్ అవకాశాలు ఇవ్వలేదని.. అందుకే చరణ్ తో సినిమా ప్లాన్ చేసినట్లు ప్రచారంలో ఉంది. వాటన్నింటిని చెరుపుకోవాలంటే చరణ్ కి బ్లాక్ బస్టర్ ఇచ్చి నిరూపించాలి. చరణ్ సినిమా విషయంలో శంకర్ మొదటి నుంచి కసి పట్టుదలతో పనిచేస్తున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ కి జోడీగా కియారా అద్వాణి నటిస్తోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పై దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.